షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలోని అమ్షిపొర ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న..

షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 18, 2020 | 6:29 AM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలోని అమ్షిపొర ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

కాగా, శుక్రవారం కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.