కరోనా సోకిన మహిళపై అత్యాచారం.. అది కూడా క్వారంటైన్‌ సెంటర్‌లో..

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో నవీ ముంబైలోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళపై దుండుగుల అత్యాచారానికి ఒడిగట్టారు. పన్వెల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి ఈ..

కరోనా సోకిన మహిళపై అత్యాచారం.. అది కూడా క్వారంటైన్‌ సెంటర్‌లో..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 18, 2020 | 6:16 AM

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో నవీ ముంబైలోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళపై దుండుగుల అత్యాచారానికి ఒడిగట్టారు. పన్వెల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పన్వెల్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితురాలికి కరోనా సోకిందని.. దీంతో ఆమె క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం అత్యాచారానికి ఒడిగట్టింది ఓ 25 ఏళ్ల యువకుడు అని తేలిందని పోలీసులు తెలిపారు. అయితే సదరు నిందితుడు కూడా కరోనా పాజిటివ్ సోకిన వాడేనని.. ఇంకా అతడిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది.