Electoral Bond: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల డేటా విడుదల చేసిన ఈసీ
ఎన్నికల బాండ్‌లకు సంబంధించి SBI నుండి స్వీకరించిన డేటాను ఎన్నికల సంఘం గడువుకు ఒక రోజు ముందు గురువారం మార్చి 14న తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు వివరాలను ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.

ఎన్నికల బాండ్‌లకు సంబంధించి SBI నుండి స్వీకరించిన డేటాను ఎన్నికల సంఘం గడువుకు ఒక రోజు ముందు గురువారం మార్చి 14న తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు వివరాలను ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అదే సమయంలో సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి, SBI మార్చి 12 న ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన డేటాను అందించింది.
అంతకుముందు, మార్చి 11న ఎన్‌క్యాష్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిరంగపరచడానికి జూన్ 30 వరకు సమయం కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బ్యాంకు దరఖాస్తును తిరస్కరించింది. మార్చి 12, మంగళవారం పని గంటలు ముగిసేలోగా సమాచారాన్ని వెల్లడించాలని బెంచ్ SBIని ఆదేశించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సీజేఐ చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, 2018 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. వాటిని జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఎస్‌బిఐని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
