Bank Fraud: బ్యాంకు మోసం కేసులో మాజీ ఎంపీ అరెస్ట్.. రూ.47.76 కోట్లు విలువ చేసే బంగారం, వెండి సీజ్‌

| Edited By: Ravi Kiran

Sep 15, 2022 | 2:24 PM

ప్రైవేట్ లాకర్లను తనిఖీ చేయగా సరైన నిబంధనలు పాటించకుండా లాకర్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో, KYC పాటించలేదు. ప్రాంగణంలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయలేదు. ఇది మాత్రమే కాదు,

Bank Fraud: బ్యాంకు మోసం కేసులో మాజీ ఎంపీ అరెస్ట్.. రూ.47.76 కోట్లు విలువ చేసే బంగారం, వెండి సీజ్‌
Ed Seizes
Follow us on

Bank Fraud: ముంబైలోని డిఫెన్స్‌ బులియన్‌ అండ్‌ క్లాసిక్‌ మార్బుల్స్‌ ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 431 కిలోల బంగారం, వెండిని స్వాధీనం చేసుకుంది. దీని మార్కెట్ విలువ 47.76 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు లాకర్లను తెరిచి చూడగా 91.5 కిలోల బంగారం (ఇటుకలు), 152 కిలోల వెండి లభించాయని, వాటిని జప్తు చేసినట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. డిఫెన్స్ బులియన్ ప్రాంగణంలో అదనంగా 188 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన బంగారం, వెండి మొత్తం విలువ రూ.47.76 కోట్లు.

గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ M/s పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బ్యాంకులను మోసం చేసి 2296.58 కోట్ల రుణాలు తీసుకున్నట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. ED ప్రకటన ప్రకారం, దాడి సమయంలో M/s రక్షా బులియన్ ప్రాంగణంలో ప్రైవేట్ లాకర్ల కీలు కనుగొనబడ్డాయి.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ లాకర్లను తనిఖీ చేయగా సరైన నిబంధనలు పాటించకుండా లాకర్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో, KYC పాటించలేదు. ప్రాంగణంలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయలేదు. ఇది మాత్రమే కాదు, ఇన్,అవుట్ రిజిస్టర్ లేదు. లాకర్ ప్రాంగణంలో సోదాలు చేయగా 761 లాకర్లు ఉన్నాయని, వాటిలో 3 M/s రక్షా బులియన్‌కు చెందినవని ఆ ప్రకటనలో తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
బ్యాంకు రుణాల మోసం కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది. మంగళవారం సీబీఐ కోర్టులో గీత, ఆమె భర్త, మరో ఇద్దరు దోషులుగా రుజువు కావడంతో అరెస్ట్ చేశారు. 2009లో బ్యాంకు నుంచి 25 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని, ఆ తర్వాత అది 42 కోట్లకు పెరిగిందని ఆరోపించారు.

ఈ కేసులో గీతతో పాటు ఆమె భర్త విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకోటేశ్వర్‌తో పాటు మరికొందరిపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. న్యాయస్థానం జరిమానా విధించడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. గీత 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ తరపున అరకు లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 2018లో వైఎస్‌ఆర్‌ని వీడి బీజేపీలో చేరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి