Elections: ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం లేదా.? క్లారిటీ ఇచ్చిన ఎలక్షన్‌ కమిషన్‌

ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్ ఓటు ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులు ఎన్నికల కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయకుండా నిషేధం విధించినట్లు ఒక మెసేజ్‌ వాట్సాప్‌లో తెగ వైరల్‌ అవుతోంది...

Elections: ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం లేదా.? క్లారిటీ ఇచ్చిన ఎలక్షన్‌ కమిషన్‌
Postal Ballot
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2024 | 3:14 PM

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దేశమంతా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో కొన్ని నిజమైన వార్తలు ఉంటే మరికొన్ని ఫేక్‌ న్యూస్‌ కూడా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వార్తే వాట్సాప్‌లో తెగ సర్క్యూలేట్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? దానిపై ఎన్నికల సంఘం ఎలాంటి క్లారిటీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..

ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్ ఓటు ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులు ఎన్నికల కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయకుండా నిషేధం విధించినట్లు ఒక మెసేజ్‌ వాట్సాప్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, అది ముమ్మాటికీ తప్పుదోవ పట్టించే, నకిలీ మెసేజ్‌ అని తేల్చి చెప్పింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు తమకు కేటాయించిన కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు’ అని పేర్కొంది.

దీంతో పాటు పోలింగ్ సమయంలో ఓటర్‌ కార్డు మర్చిపోతే ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావొచ్చని ఈసీ తెలిపింది. వీటిలో.. ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, ఫొటో ఉన్న పించన్‌ పత్రాలు, బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ పాస్‌ బుక్‌, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు వంటివి వెంట తెచ్చుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..