Back-to-back earthquakes : ఒక్క రాత్రిలో వరుస భూ ప్రకంపనలు.. హడలిపోయిన జనం..
Earthquake of Magnitude: రెండు ఈశాన్య రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము లోపు వెంటది వెంటనే స్వల్ప స్థాయి భూ ప్రకంపనలు చోటు చేసుకన్నట్లుగా..
హిమాలయ పర్వత సానువుల్లోని రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము లోపు వెంటది వెంటనే స్వల్ప స్థాయి భూ ప్రకంపనలు చోటు చేసుకన్నట్లుగా జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం(NCS) వెల్లడించింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపణలు వచ్చినట్లుగా తెలిపింది.
మణిపూర్‌లోని శిరుయ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున 1.22 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయ్యిందని ప్రకటించింది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగిన్‌లో 3.1 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది. అర్థరాత్రి 1.02 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టంకానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని ఎన్‌సీఎస్ వెల్లడించింది.
Earthquake of Magnitude:3.1, Occurred on 20-06-2021, 01:02:07 IST, Lat: 28.89 & Long: 94.79, Depth: 17 Km ,Location: 95km NNW of Pangin, Arunachal Pradesh, India for more information download the BhooKamp App https://t.co/yt59fSXYZQ pic.twitter.com/tq4N2fi99X
— National Center for Seismology (@NCS_Earthquake) June 19, 2021