Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం.. 48 గంటల్లో రెండో సారి!
దేశ రాజధాని మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్టు తెలుస్తోంది. భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా గడిచిన 48 గంటల్లో ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించడం ఇది రెండో సారి.

దేశ రాజధానిలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం సాయంత్రం హర్యానాలోని ఝజ్జర్‌లో 3.7 తీవ్రతతో ఈ భూకంపం ఏర్పడగా.. ఆ తర్వాత ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గడిచిన 48 గంటల్లో హర్యానాలో భూకంపం సంభవించడం ఇది రెండో సారి. రాత్రి 7.49 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. హర్యానాలోని రోహ్తక్ బహదూర్‌గఢ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
EQ of M: 3.7, On: 11/07/2025 19:49:43 IST, Lat: 28.68 N, Long: 76.72 E, Depth: 10 Km, Location: Jhajjar, Haryana. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Msp1JNfEb9
— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2025
కాగా, గురువారం కూడా హర్యానాలోని ఝజ్జర్‌లో ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఢీల్లీలోని ఎన్ సీఆర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఝజ్జర్‌కు ఈశాన్య దిశగా సుమారు 4కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి 10కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్టు గుర్తించారు. రెండ్రోజుల్లో సంభవించిన ఈ భూప్రకంపనల కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




