Earthquake: బీహార్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం.. తేజస్వీ ట్వీట్

Earthquake in Bihar: బీహార్‌ రాష్ట్రంలోని పలుచోట్ల సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీంతో బీహార్ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం రాత్రి 9.23..

Earthquake: బీహార్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం.. తేజస్వీ ట్వీట్
Follow us

|

Updated on: Feb 15, 2021 | 10:54 PM

Earthquake in Bihar: బీహార్‌ రాష్ట్రంలోని పలుచోట్ల సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీంతో బీహార్ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం రాత్రి 9.23 నిమిషాలకు బీహార్‌లోని నలంద సమీపంలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నలందకు 20 కిలోమీటర్ల దూరంలో.. 5 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. నలంద, పాట్నా, తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో బీహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ట్విట్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బహిరంగా ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.

ఇదిలాఉంటే.. ఈ మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. శుక్రవారం తజకిస్థాన్‌తోపాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్, యూపీ, తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

Also Read:

Puducherry: యానాం ఎమ్మెల్యే పదవికి మల్లాడి కృష్ణారావు రాజీనామా.. ప్రమాదంలో నారాయణస్వామి ప్రభుత్వం

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!