Viral News: లక్కు అంటే వీరిదే.. ఉద్యోగులకు దీపావళికి గిఫ్ట్ గా కార్లు ఇచ్చిన యజమాని..

కొన్ని కార్పోరేట్ సంస్తలు తమ ఉద్యోగులకు రాచమర్యాదలు చేస్తాయి. మంచి భోజనం, రిలాక్స్ అవ్వడానికి జిమ్ వంటివి ఆఫీసులోనే అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఈ కార్పోరేట్ సంస్థలను చూసి కొన్ని సంప్రదాయక పరిశ్రమల యాజమాన్యంలో కూడా మార్పులు వచ్చాయి. టెక్ సంస్థలతో పోటీ పడుతూ తమ ఉద్యోగులకు కూడా రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించాయి. తాజాగా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా కార్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఓ సంస్థ యజమాని

Viral News: లక్కు అంటే వీరిదే.. ఉద్యోగులకు దీపావళికి గిఫ్ట్ గా కార్లు ఇచ్చిన యజమాని..
Diwali GiftsImage Credit source: LinkedIn
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 22, 2024 | 8:34 PM

నేటి కార్పొరేట్ పోటీ ప్రపంచంలో కంపెనీలకు ఉద్యోగులే అసలైన వనరులు. వారి విలువను గుర్తిస్తున్న అనేక సంస్థలు ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నాయి. గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఆఫీసుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తాజాగా హర్యానాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ.. అత్యధిక ప్రతిభగల ఉద్యోగులకు ఏకంగా కార్లనే దీపావళి బహుమతులుగా ఇచ్చేసింది

హర్యానాకు చెందిన మిట్స్ హెల్త్‌కేర్ అనే ఫార్మా సంస్థ 15 మందికి ఈ దీపావళి బహుమతులు ఇచ్చింది. వాళ్లు తమ ఉద్యోగులు కారనీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు అంటూ సంస్థ వ్యవస్థాపకుడు ఎమ్‌కే భాటియా తెలిపారు. తాము సాధారణంగా యువతీయువకులను ఉద్యోగంలోకి తీసుకుని తగిన శిక్షణ ఇస్తామనీ ఆ తరువాత వారిలో అద్భుత పనితీరు కనబరిచిన వారికి తమ బృందాలకు ప్రెసిడెంట్స్‌గా చేస్తామనీ ఆ తరువాత మళ్లీ పనితీరు ఆధారంగానే డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తామనీ అన్నారు. ఇదే క్రమంలో వారికి కార్లు కూడా బహూకరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తమ పనితీరును మెరుగుపరుచుకునేలా యువ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కార్లను బహుమతులుగా ఇస్తున్నట్టు తెలిపారు. ఇలా తన ఉఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడానికి కారణం ఒకప్పుడు తనకు ఎదురైనా కారణం అని భాటియా వెల్లడించారు.

వ్యాపార రంగంలో అడుగు మొదటి విజయం అందుకున్న తర్వాత ఒక కారు ఖరీదు చేసినట్లు.. అప్పుడు తనకు ప్రజల్లో తగిన గౌరవం దక్కినట్లు భావించానని చెప్పారు. కారు కొన్నాక తనలో కాన్ఫిడెన్స్ పీక్స్‌కు వెళ్లిందనీ కాబట్టి ఇదే లాజిక్ అనుసరిస్తున్నట్లు చెప్పారు. కార్లు బహుమతిగా ఇచ్చాక కొందరు ఉద్యోగుల లైఫ్ స్టైలే మారిపోయిందని తెలిపారు.

అయితే ఇటీవల చెన్నైకి చెందిన ఓ సంస్థ దీపావళి కానుకగా తన ఉద్యోగులకు ఏకంగా 28 కార్లు, 29 బైకులను ఇచ్చింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ సహా మెర్సిడీస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లను సైతం ఈ బహుమతుల్లో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..