AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. శివసేనలో చేరుతున్న ఎంపీ కుమారుడు.. కారణం అదేనా?

అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీలు మారే గేమ్ కూడా కొనసాగుతోంది.

ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. శివసేనలో చేరుతున్న ఎంపీ కుమారుడు.. కారణం అదేనా?
Bjp Mp Narayan Rane, Nilesh Rane
Balaraju Goud
|

Updated on: Oct 22, 2024 | 6:51 PM

Share

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీలు మారే గేమ్ కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారుడు నీలేష్ రాణే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

భారతీయ జనతా పార్టీ ఎంపీ నారాయణ్ రాణే కుమారుడు నీలేష్ రాణే మంగళవారం (అక్టోబర్ 22) తాను ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరి కుడాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అధికార మహాయుతి కూటమిలో సీట్ల షేరింగ్ ఫార్ములా ప్రకారం కుడాల్ నియోజకవర్గం శివసేనకు కేటాయించారు. అందుకే నీలేష్ బీజేపీ నుంచి శివసేనలోకి మారుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శివసేన (UBT)కి చెందిన వైభవ్ నాయక్ కుడాల్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అతను నీలేష్ రాణేకు ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు తలపడ్డారు. అయితే కుడాల్ అసెంబ్లీ నియోజకవర్గం నారాయణ్ రాణే ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలోకి వస్తుండటం విశేషం. రత్నగిరి-సింధుదుర్గ్‌లో భాగం. సమీపంలోని కంకావలి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీలో ఉన్న నీలేష్ తమ్ముడు నితీష్ రాణే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని కంకావలి స్థానం నుండి బీజేపీ తన అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, కొంకణ్ ప్రముఖ నాయకుడు నారాయణ్ రాణే కుమారుడు నితీష్ రాణేను తిరిగి అభ్యర్థిగా చేసింది.

నీలేష్ రాణే గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్, మంత్రి గిరీష్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్న 99 మంది అభ్యర్థుల తొలి జాబితాలో బీజేపీ 71 మంది ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించింది.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు 23 నుంచి 9కి పడిపోయాయి. బీజేపీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన శివసేన (అవిభక్త)తో పొత్తుతో పోటీ చేసి 164 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ సమయంలో బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..