Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: అయోధ్య రామ మందిరంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు..

అయోధ్య రామ మందిరం గురించి కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునికి గొప్ప ఆలయం నిర్మించడం భారతదేశ ప్రజల చిరకాల కోరిక అన్నారు. అయోధ్య శ్రీరాముని ప్రాణ్‌ప్రతిష్ఠ తేదీ సమీపిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా దైవత్వం, ఆనందం ఉట్టిపడుతోందన్నారు. ఇది ఇండియా కూటమిలో భయాన్ని లో సృష్టిస్తోందని కాంగ్రెస్ కూటమికి చురకలు అంటించారు.

Dharmendra Pradhan: అయోధ్య రామ మందిరంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు..
Union Minister Dharmendra Pradhan
Follow us
Srikar T

|

Updated on: Dec 28, 2023 | 5:45 PM

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక గురించి కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునికి గొప్ప ఆలయం నిర్మించడం భారతదేశ ప్రజల చిరకాల కోరిక అన్నారు. అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ తేదీ సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా దైవత్వం, ఆనందం ఉట్టిపడుతోందన్నారు.  అయిత ఇది ఇండియా కూటమిలో మాత్రం భయాన్ని సృష్టిస్తోందని కాంగ్రెస్ కూటమికి చురకలు అంటించారు.

రామ మందిరం ప్రారంభోత్సవ వైభవం చూస్తుంటే కాంగ్రెస్ సీనియర్ నేత సామ్ పిట్రోడా గుండెల్లో మంటలు పుడుతున్నాయని విమర్శించారు.  మన మధ్యలోనే అలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, భారతదేశ ఆత్మ, మనస్తత్వం, దాని మానసిక స్థితిని కాంగ్రెస్ ఎందుకు అర్థం చేసుకోలేక పూర్తిగా డిస్‌కనెక్ట్ అయిందో అర్థం కావడం లేదని ప్రధాన్ ‘ఎక్స్’ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సామ్ పిట్రోడా గతంలో ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రామ మందిర ప్రాణ ప్రతిష్టపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత ప్రధానమైన సమస్య రామమందిరమా.. లేక నిరుద్యోగం.. ద్రవ్యోల్భణమా అని ప్రశ్నించారు. దీనికి బదులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ అయోధ్య శ్రీరాముని ఆలయం చూసి దేశమంతా ఆనందంతో పరవశించి పోతుంటే.. కాంగ్రెస్ మాత్రం నష్టం జరుగుతుందేమో అని భయపడుతోందని తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..