దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఉద్యోగులు.. కారుతో పరార్..
కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా, అతడు ఎంతకీ స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దాబా సమీపంలో ఉన్న పాన్ షాపు యజమానికి ఫోన్ చేశారు. ఏం జరిగిందోనని ఆరా తీసేందుకు దాబాకు చేరుకున్న పాన్ షాప్ యజమాని.. రక్తపు మడుగులో పడివున్న ధెంగ్రేను గమనించాడు.. ఒక్కసారిగా షాక్‌కు గురైన అతడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపావళి బోనస్ ఇవ్వలేదనే కోపంతో దాబా యజమానిని అతని ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగుల దీపావళి బోనస్ డిమాండ్‌ను యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద ఉద్యోగులు యజమాని గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి దారుణంగా హతమార్చారు. మృతుడు రాజు ధెంగ్రేగా గుర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని మండలా వాసులు ఛోటూ, ఆదిగా గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం నగరంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర బస్టాప్ సమీపంలో లేబర్ కాంట్రాక్టర్ ద్వారా నిందితులైన ఈ ఇద్దరినీ ధెంగ్రే తన దాబాలో పనిలో నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు.
దీపావళి రోజున డబ్బు, బోనస్ కోసం ఇద్దరూ డిమాండ్ చేశారు. అందుకు యజమాని అంగీకరించలేదు. దాంతో ఆది, చోటూతో ధెంగ్రే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. దాంతో కోపం పెంచుకున్న ఆ ఇద్దరు రాత్రి భోజనం చేసిన తర్వాత దేంగ్రే మంచం మీద పడుకుని నిద్రపోతుండగా దాడికి తెగబడ్డారు. ఇదిలా ఉండగానే, ధెంగ్రే కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా, అతడు ఎంతకీ స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దాబా సమీపంలో ఉన్న పాన్ షాపు యజమానికి ఫోన్ చేశారు. ఏం జరిగిందోనని ఆరా తీసేందుకు దాబాకు చేరుకున్న పాన్ షాప్ యజమాని.. రక్తపు మడుగులో పడివున్న ధెంగ్రేను గమనించాడు.. ఒక్కసారిగా షాక్‌కు గురైన అతడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. నిందితులిద్దరూ అతన్ని గొంతుకోసి, ఆపై బరువువైన వస్తువుతో అతని తలపై కొట్టారు. పదునైన ఆయుధంతో అతని ముఖంపై దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఉదంతాన్ని వివరించారు.
మృతుడు ధేంగ్రే, కుహి తాలూకాలోని సుర్గావ్ గ్రామానికి చెందిన మాజీ ‘సర్పంచ్’ అని తెలిసింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఏరియా ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ మాట్లాడుతూ హత్య వెనుక ప్రాథమిక కారణం డబ్బే అని తెలుస్తుందన్నారు. అయితే,’రాజకీయ వైరానికి సంబంధించిన కోణం కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..