AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Delhi: 20 విమానాశ్రయాల్లో 2 వేల విమానాలను ఢీకొన్న పక్షులు… DGCA డేటా వెల్లడి

దేశంలో వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో DGCA వెల్లడించిన డేటా ఆందోళన రేకెత్తిస్తోంది. విమానాశ్రయాల్లో పక్షులు, జంతువులు ఢీకొనడం విమానాల భద్రతకు పెను ముప్పుగా మారిందని తెలిపింది. ప్రధాన విమానాశ్రయాలలో పక్షులు, జంతువులు ఢీకొనడం భద్రతా సమస్యలను లేవనెత్తుతోంది. దేశంలో ఇటీవల...

New Delhi: 20 విమానాశ్రయాల్లో 2 వేల విమానాలను ఢీకొన్న పక్షులు... DGCA డేటా వెల్లడి
Birds Fly Around Flight
K Sammaiah
|

Updated on: Jul 16, 2025 | 10:54 AM

Share

దేశంలో వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో DGCA వెల్లడించిన డేటా ఆందోళన రేకెత్తిస్తోంది. విమానాశ్రయాల్లో పక్షులు, జంతువులు ఢీకొనడం విమానాల భద్రతకు పెను ముప్పుగా మారిందని తెలిపింది. ప్రధాన విమానాశ్రయాలలో పక్షులు, జంతువులు ఢీకొనడం భద్రతా సమస్యలను లేవనెత్తుతోంది. దేశంలో ఇటీవల అత్యంత రద్దీగా ఉన్న 20 విమానాశ్రయాలలో గత రెండు సంవత్సరాలలో ఏటా 2,000 విమానాలు మరియు జంతువులను ఢీకొన్న సంఘటనలు నమోదయ్యాయి. అయితే, ఈ సంవత్సరం ఈ సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. తొలి ఐదు నెలల్లో ఇప్పటివరకు 641 మాత్రమే ఇటువంటి సంఘటనలు నమోదు కావడం హర్షించదగ్గ పరిణామం.

DGCA పంచుకున్న డేటా ప్రకారం, ఈ విమానాశ్రయాలలో 2022లో 1,633 పక్షి/జంతువుల దాడులు జరిగాయని వెల్లడైంది. ఇది 2023లో 2,269కి పెరిగింది. 2024లో 2,066 నమోదు కావడం వల్ల కొద్దిగా తగ్గినట్లయింది. ఢిల్లీలో అత్యదిక సంఘటనలు నమోదైనట్లు DGCA డేటా వెల్లడిస్తుంది. గత మూడు సంవత్సరాలలో ఏటా సగటున 400 సంఘటనలు జరిగాయి. 2022లో 442, 2023లో 616 మరియు 2024లో 419 దాడులు జరిగాయని డేటా నివేదిస్తుంది. 2025లో, ఇప్పటివరకు 95 విమానాలు పక్షులు లేదా జంతువులను ఢీకొన్నాయి.

అహ్మదాబాద్ విమానాశ్రయం అత్యంత ప్రభావితమైన విమానాశ్రయాలలో రెండవది. 2022లో ఇది 80 విమానాలు మాత్రంమే పక్షులు/జంతువులను తాకినప్పటికీ, ఈ సంఖ్య 2023లో 214కి మరియు 2024లో 201కి రెట్టింపు అయింది. జూన్ 12న విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రీమ్‌లైనర్ క్రాష్ తర్వాత, ఆ ప్రాంతంలో పక్షులు అధికంగా ఉండటంతో పక్షి ఢీకొనడం వల్ల రెండు ఇంజిన్లు ఆగిపోయాయనే అనుమానాలు వ్యాపించాయి.

విమానాశ్రయాలలో పక్షి-జంతువుల ముప్పును సమర్థవంతంగా పరిష్కరించడానికి, నేషనల్ వైల్డ్‌లైఫ్ హజార్డ్ మేనేజ్‌మెంట్ కమిటీ యొక్క మొదటి సమావేశం ఇటీవల ఢిల్లీలోని DGCA ప్రధాన కార్యాలయంలో దాని డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు మరియు విమానయాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

DGCA చేసిన ప్రదర్శన ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలలో కేవలం 24% విమానాలలో మాత్రమే పక్షి జాతులు గుర్తించబడ్డాయి” అని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు మాట్లాడుతూ, గబ్బిలాలు IGIలో ప్రధాన ముప్పుగా ఉద్భవించాయని అన్నారు. “బ్లాక్ లైట్ ట్రాప్, పోల్ పిజియమ్స్, నైట్ విజన్ బైనాక్యులర్స్, బ్యాట్ డిటెక్షన్ డివైస్, ఏవియన్ డిఫెండర్స్ వంటి సాంకేతికతలు మరియు జీవశాస్త్రవేత్తల బృందాన్ని మోహరించడం ద్వారా వాటి ఉనికిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు” అని ఒక అధికారి తెలిపారు.