సరిహద్దుల్లో హై టెన్షన్.. డ్రాగన్ తోక కత్తిరించిన భారత్..
భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మరోసారి చైనా సైన్యం టెంపర్మెంట్‌కు చెక్ పెట్టింది భారత్. అగ్రరాజ్యం, డ్రాగన్‌ల మధ్య వైరస్ వార్‌తో.. చైనా నుంచి బయటికి రావాలని చూస్తున్నాయి పలు కంపెనీలు. తమ యూనిట్లను భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశం చైనా మళ్లీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. వివాదాస్పద సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల సిక్కిం, లడఖ్ సరిహద్దులో ఇరు దేశాల సైన్యం ఘర్షణలకు దిగారు. ఈ ఘటనల్లో […]

భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మరోసారి చైనా సైన్యం టెంపర్మెంట్‌కు చెక్ పెట్టింది భారత్. అగ్రరాజ్యం, డ్రాగన్‌ల మధ్య వైరస్ వార్‌తో.. చైనా నుంచి బయటికి రావాలని చూస్తున్నాయి పలు కంపెనీలు. తమ యూనిట్లను భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశం చైనా మళ్లీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. వివాదాస్పద సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల సిక్కిం, లడఖ్ సరిహద్దులో ఇరు దేశాల సైన్యం ఘర్షణలకు దిగారు. ఈ ఘటనల్లో పలువురు సైనికులు కూడా గాయపడ్డారు. అయితే స్థానిక అధికారుల మధ్య చర్చల అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.
ఇదిలావుంటే.. మళ్లీ చైనాకు చెందిన మిలిటరీ విమానాలు నిషిద్ధ గగనతలంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. డ్రాగన్ సైన్యం గాల్వన్ నది సమీపంలో క్యాంప్‌లు ఏర్పాటుచేశాయి. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు అక్కడికి దూసుకెళ్లాయి. సరిహద్దుకు అదనపు బలగాలను పంపింది భారత్. ఇటు చైనా కూడా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఫలితంగా అక్కడ మరోసారి టెన్షన్ వాతావరణమేర్పడింది.
గాల్వన్ ప్రాంతం 1962 యుద్ధంలో కూడా ఓ ట్రిగ్గర్ పాయింట్. 2013లోనూ 21 రోజుల పాటు ఘర్షణలు జరిగాయి. 2017లో లడఖ్ సమీపంలోని పాంగాంగ్ లేక్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ ముదరడంతో డోక్లాం సరిహద్దులో 73 రోజుల పాటు ఇరు దేశాలకు చెందిన బలగాలను మోహరించారు. ఐతే ఇరుదేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల చర్చలతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరు దేశాలు సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. కానీ అప్పటినుంచి తరచూ అక్కడ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా లడఖ్‌లో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చైనా సైన్యం వివాదాస్పద ప్రాంతంలో క్యాంప్‌లు ఏర్పాటుచేయడం, చొరబాట్లకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.



