Demicron Symptoms: ఒమిక్రాన్+డెల్టా కజీన్ ‘డెల్మిక్రాన్’.. వైరస్ సోకిన వారిలో లక్షణాలేంటంటే..
What is Delmicron: రెండేళ్లు గడుస్తున్నా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి. రౌండ్ వన్, రౌండ్ టు, రౌండ్ త్రి అంటూ ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతుంది.
What is Delmicron: రెండేళ్లు గడుస్తున్నా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి. రౌండ్ వన్, రౌండ్ టు, రౌండ్ త్రి అంటూ ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతుంది. కరోనా వైరస్ మొదట ఆల్ఫాతో మొదలైన మాయదారి కరోనా.. ఆ తరువాత డెల్టాగా రూపాంతరం చెంది యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికీ దాని ప్రభావం తగ్గనేలేదు.. కానీ, దాని కజీన్స్ మాత్రం యమ స్పీడ్‌గా వచ్చేస్తున్నాయి. డెల్టా కాస్తా ఒమిక్రాన్ రూపంలో స్పీడ్ పెంచుకుని మరీ ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఈ ఫియర్‌తో ప్రపంచ దేశాలు సతమతం అవుతుంటే.. తాను కూడా అంటూ డెల్టా+ఒమిక్రాన్ కాంబినేషన్‌లో ‘డెల్మిక్రాన్’ పేరుతో వచ్చేసి మరో రక్కసి. ఇప్పుడిదే అందరినీ కలవరానికి గురి చేస్తుంది. దీని కారణంగా మరెంత వినాశనం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు జనాలు.
డెల్మిక్రాన్ అదేని కోవిడ్ 19 రూపాంతరం కాదని మహారాష్ట్ర కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ అధికారి డాక్టర్ శశాంక్ జోషి వివరించారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ జంట స్పైక్‌ల కలయిక వల్ల ఏర్పడిందన్నారు. మరి డెల్మిక్రాన్ ఏంటి, దీని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేగంగా వ్యాప్తి.. డెల్‌మిక్రాన్ అనేది కోవిడ్-19 డబుల్ వేరియంట్. ఇది పశ్చిమ దేశాలలో ఎక్కువగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్, ఓమిక్రాన్ వేరియంట్‌లను కలపడం ద్వారా ఈ పేరు వచ్చింది. ఈ రెండు వేరియంట్‌లు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే, అధికారిక సమాచారం ప్రకారం.. యూఎస్, యూకే సహా ఐరోపా దేశాలలో ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతోంది. డెల్టా వైరస్ కంటే వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. కరోనా కట్టడికి ఆయా దేశాలు టెస్టింగ్, ట్రేసింగ్, టీకా, బూస్టర్ డోస్ విధానాన్ని అనుసరిస్తున్నారు.
డెల్‌మైక్రాన్ – ఓమిక్రాన్ తేడా ఏంటి?.. ఒమిక్రాన్ అదేని SARS-CoV-2 పరివర్తన చెందిన B.1.1.529 రూపం. దీనిని మొదటగా దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. పరిశోధనల ప్రకారం.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా కంటే తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నా.. వ్యాప్తి వేగం అందరినీ కలవర పెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే మరణాల రేటు కూడా తక్కువగా ఉందని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక డెల్‌మిక్రాన్ అనేది డెల్టా, ఓమిక్రాన్‌ల స్పైక్‌ల వల్ల ఏర్పడిందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికీ అధ్యయనాలు జరుగుతున్నాయి.
డెల్మిక్రాన్ లక్షణాలు.. ఇది సోకిన వారిలో విభిన్న లక్షణాలేవీ లేవు. ఓమిక్రాన్, డెల్టా వేరియంట్‌తో బాధపడేవారిలో ఉండే లక్షణాలే డిల్మిక్రాన్ సోనిక వారిలోనూ ఉన్నాయి. • అధిక ఉష్ణోగ్రత • నిరంతర దగ్గు • వాసన లేదా రుచిని కోల్పోవడం • తలనొప్పి • ముక్కు కారడం • గొంతు నొప్పి
ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు.. డెల్టా, ఓమిక్రాన్, డెల్మిక్రాన్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో ఒమిక్రాన్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు, నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
Also read:
Radhe Shyam : సినిమాపై అంచనాలు పెంచుతున్న ‘రాధేశ్యామ్’ కాన్సెప్ట్ పోస్టర్స్..
Hyderabad: ఆన్‌లైన్ క్లాస్‌లోకి ఎంటరైన అగంతకుడు.. మరి ఆ టీచర్ ఏం చేసిందంటే..!