Delhi Corona: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 38 శాతం పెరిగిన కేసులు

Delhi's New Covid Cases: దేశంలో కరోనా కొత్త వేయంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. క్రమంగా పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసులు

Delhi Corona: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 38 శాతం పెరిగిన కేసులు
Delhi Corona
Follow us

|

Updated on: Dec 26, 2021 | 6:51 AM

Delhi’s New Covid Cases: దేశంలో కరోనా కొత్త వేయంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. క్రమంగా పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కరోజులోనే రోజూవారి కోవిడ్ -19 కేసులు 38శాతం పెరిగాయి. ఢిల్లీలో శనివారం ఒక్కరోజు 249 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజు కంటే 38 శాతం పెరిగింది. ప్రమాదకర వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆరు నెలల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కాగా.. నిన్న కరోనా నుంచి ఒక్కరు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 25,104కి చేరుకుంది. డిసెంబర్‌లో ఇప్పటివరకు ఆరు మరణాలు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం 0.29 శాతం పాజిటివిటీ రేటుతో 180 తాజా కేసులు నమోదయ్యాయి. డేటా ప్రకారం జూన్ 13న రాజధానిలో 0.35 శాతం పాజివిటి రేటుతో 255 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,43,062కి చేరింది. ఢిల్లీలో 14.17 లక్షల మంది రోగులు సంక్రమణ నుంచి కోలుకున్నారు. కొత్త ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల మధ్య ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. రాజధానిలో 67 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. కాగా.. ఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు పెరగడంతో.. కేజ్రీవాల్ ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించారు.

అయితే.. కేసులు మరిన్ని పెరిగితే.. కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రాత్రిపూట కర్ఫ్యూ.. పాఠశాలలు, కళాశాలల మూసివేత, అనవసరమైన వస్తువుల దుకాణాలు, మెట్రో రైళ్లలో సీటింగ్ సామర్థ్యం సగానికి తగ్గించేందకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Also Read:

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

PM Modi: హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ డోస్ః ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన