Delhi violence : అల్లర్లలో జవాన్ ఇల్లు ధ్వంసం.. ఎంటరైన బీఎస్ఎఫ్.. ఏం చేసిందంటే..?

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ చట్టానికి అనుకూలంగా కూడా ర్యాలీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల్లో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. ఈ క్రమంలో అల్లరి మూకలు ఓ జవాన్ ఇంటిపై దాడికి దిగారు. ఇల్లును మొత్తం ధ్వంసం చేసి లూటీ చేశారు. అయితే విషయం కాస్త ఆలస్యంగా […]

Delhi violence : అల్లర్లలో జవాన్ ఇల్లు ధ్వంసం.. ఎంటరైన బీఎస్ఎఫ్.. ఏం చేసిందంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 01, 2020 | 8:54 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ చట్టానికి అనుకూలంగా కూడా ర్యాలీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఘర్షణల్లో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. ఈ క్రమంలో అల్లరి మూకలు ఓ జవాన్ ఇంటిపై దాడికి దిగారు. ఇల్లును మొత్తం ధ్వంసం చేసి లూటీ చేశారు. అయితే విషయం కాస్త ఆలస్యంగా బీఎస్ఎఫ్ అధికారులకు తెలిసింది. దీంతో సమాచారం అందుకున్న వెంటనే స్పందించారు.

బీఎస్‌ఎఫ్‌కు చెందిన జవాను కుటుంబం.. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో తీవ్రంగా నష్టపోయింది. ఢిల్లీలోని ఖాస్‌ ఖజురీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అనీస్‌.. 2013లో బీఎస్‌ఎఫ్‌‌లో జవాన్‌గా చేరాడు. ప్రస్తుతం వెస్ట్‌బెంగాల్‌లోని విధులు నిర్వహిస్తున్నాడు. అది కూడా మారుమూల ప్రాంతమైన రాధాబారి ఏరియాలో. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో దుండగులు జవాన్ ఇంటిని పూర్తిగా తగలబెట్టేశారు. దీంతో ఇంట్లో ఉన్న అతడి తండ్రి మునీస్‌, ఇతర కుటుంబసభ్యులు ఆర్మీ సహాయంతో బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. సహచర జవాన్ ఇల్లు పూర్తిగా తగలబడటంతో.. బీఎస్ఎఫ్ అధికారులు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందడుగు వేశారు.

అయితే అల్లర్లలో తన ఇల్లు పూర్తిగా ధ్వంసమైన విషయాన్ని అనీస్ కనీసం తన తోటి సిబ్బందికి సైతం తెలియజేయకపోవడం గమనార్హం. వార్తా పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. వెంటనే బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులను అనీస్ తండ్రి వద్దకు పంపించారు. జవాన్‌ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు నిర్మాణం కోసం సహకరిస్తామన్నారు. అంతేకాకుండా మరో మూడు నెలల్లో వివాహం చేసుకోబోతున్న అనీస్‌కు.. ఈ సాయాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా..బీఎస్‌ఎఫ్‌ రిలీఫ్ ఫండ్ నుంచి సోమవారం రూ.5లక్షలు చెక్కును కూడా అందజేయనున్నారు.