Watch: తరగతి గది గోడలకు ఆవుపేడ పూసిన కాలేజీ ప్రిన్సిపాల్.. అసలు మ్యాటర్ వేరే..!
వైరల్ వీడియోలో, ప్రిన్సిపాల్‌తోపాటు, కొంతమంది ఉద్యోగులు తరగతి గదిలో ఉన్నారు. వారు గోడలపై ఆవు పేడను పూయడంలో ప్రిన్సిపాల్‌కు సహాయం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకుల కోసం ప్రిన్సిపాల్ స్వయంగా వాట్సాప్ గ్రూపులో వీడియోను పంచుకున్నారు. వీడియోలో ఆమె కుర్చీపై నిలబడి, కళాశాల సిబ్బంది సహాయంతో సి-బ్లాక్‌లోని ఒక గది గోడలపై ఆవు పేడను పూయడం కనిపిస్తుంది.

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గో మూత్రాన్ని, గో మలాన్ని సాంప్రదాయక పద్ధతుల్లో హిందూ ధర్మ కార్యక్రమాల్లో వినియోగించడం చూస్తూ ఉంటాం. కానీ గోవు మలం, ఆవు పేడతో ఎండ వేడిమిని తట్టుకోవచ్చా అనే అంశంపై ప్రత్యూష వత్సల, ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు తరగతి గది గోడలకు ఆవు పేడను రాసి ప్రయోగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్టు పేరు సాంప్రదాయ భారతీయ పద్ధతులను ఉపయోగించి వేడి నియంత్రణ అధ్యయనం అని చెబుతున్నారు.
లక్ష్మీబాయి కాలేజీలో సి బ్లాక్ లో తరగతి గదుల్లో ఎండ వేడి తగ్గించేందుకు ఈ ప్రయోగం చేశారు. వారం రోజుల్లో మొత్తం ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తానని ప్రన్సిపాల్ ప్రత్యూష వత్సల తెలిపారు. ఆవు పేడ గోడలకు రాయడం మూఢ నమ్మకానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది శాస్త్రీయ పరిశోధనలో ఒక భాగం అన్నారు. తమ అధ్యాపకుల్లో ఒకరు ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారన్నారు. సాంప్రదాయ భారతీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉష్ణ ఒత్తిడి నియంత్రణను అధ్యయనం చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు ప్రత్యూష వత్సల.
ప్రొఫెసర్ డాక్టర్ ప్రత్యూష వత్సల ఎవరు?
లక్ష్మీబాయి కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, ప్రొఫెసర్ డాక్టర్ ప్రత్యూష వత్సల కళాశాల ప్రిన్సిపాల్. జూన్ 2015 నుండి లక్ష్మీబాయి కాలేజీలో పనిచేస్తున్నారు. ఆమె జూన్ 2000 నుండి జూన్ 2015 వరకు డెహ్రాడూన్‌లోని DBS (PG) కాలేజీలో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ, ఫైజాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆమె వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో విస్తృతంగా వ్యాసాలను రాశారు.
వైరల్ వీడియో చూడండి..
వైరల్ వీడియోలో, ప్రిన్సిపాల్‌తోపాటు, కొంతమంది ఉద్యోగులు తరగతి గదిలో ఉన్నారు. వారు గోడలపై ఆవు పేడను పూయడంలో ప్రిన్సిపాల్‌కు సహాయం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకుల కోసం ప్రిన్సిపాల్ స్వయంగా వాట్సాప్ గ్రూపులో వీడియోను పంచుకున్నారు. వీడియోలో ఆమె కుర్చీపై నిలబడి, కళాశాల సిబ్బంది సహాయంతో సి-బ్లాక్‌లోని ఒక గది గోడలపై ఆవు పేడను పూయడం కనిపిస్తుంది. సి-బ్లాక్‌లో ఎండ తీవ్రత పరిష్కరించడానికి స్వదేశీ పద్ధతులను అవలంబిస్తున్నారని ప్రిన్సిపాల్ గ్రూప్‌లో పేర్కొన్నారు. అసలు విషయం తెలియక కొందరు నెటిజన్లు మూఢనమ్మకాలతో ప్రిన్సిపాల్ ఆవు పేడను గోడలకు రాశారని విమర్శించారు. కానీ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రత్యూష్ వత్సల.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..