రోడ్డుకు అడ్డంగా ఉంటే మరీ ఇంత దారుణానికి ఒడిగడుతారా

ఢిల్లీలోని రంజీత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తు్న్న కారుకి స్కూటర్ అడ్డుగా ఉండటంతో ఓ డెలివరీ బాయ్‌ను హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి పంకజ్ ఠాకూర్ అనే డెలివరీ రంజీత్ నగర్‌లోని రోడ్డుపై తన స్కూటర్‌తో నిల్చొని ఉన్నాడు.

రోడ్డుకు అడ్డంగా ఉంటే మరీ ఇంత దారుణానికి ఒడిగడుతారా
Death

Updated on: Apr 24, 2023 | 12:28 PM

ఢిల్లీలోని రంజీత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తు్న్న కారుకి స్కూటర్ అడ్డుగా ఉండటంతో ఓ డెలివరీ బాయ్‌ను హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి పంకజ్ ఠాకూర్ అనే డెలివరీ రంజీత్ నగర్‌లోని రోడ్డుపై తన స్కూటర్‌తో నిల్చొని ఉన్నాడు. మనీష్, లాల్‌చంద్ అనే ఇద్దరు వ్యక్తులు కార్లో ఆ రూట్ వైపు వచ్చారు. పంకజ్‌ తన స్కూటర్‌తో దారికి అడ్డంగా ఉండటంతో అతడ్ని చిదకబాదారు. వారు కొట్టిన దెబ్బలకి పంకజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించగా పంకజ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అందులో కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి పంకజ్‌తో గొడవ పడ్డారు. ఆ తర్వాత పంకజ్ నేలపై స్ప్రుహ కోల్పోయేవరకు వారు కొడుతూనే ఉన్నారు.అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పారిపోయారు. దీంతో నిందితుల కోసం గాలించిన పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..