AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Restaurant Saree Row: ఆధునికత పేరుతో చక్కదనాల చీరనే అవమానిస్తున్నారా?

భారతీయతను ప్రతిబింబించే చీరకట్టు చిన్నబోతోందా? ఆధునికత పేరుతో చక్కదనాల చీరనే అవమానిస్తున్నారా? పెళ్ళిళ్లూ పేరంటాలకు తప్ప పబ్‌లూ, క్లబ్‌లకు చీరలతో వెళితే ఒప్పుకోరా? శారీతో వెళితే నో చెపుతోన్న ఢిల్లీ రెస్టారెంట్లు... దేశ రాజధానిలోనే భారతీయ వస్త్ర సంస్కృతికి అవమానం... అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.

Delhi Restaurant Saree Row: ఆధునికత పేరుతో చక్కదనాల చీరనే అవమానిస్తున్నారా?
Delhi Restaurant Saree Row
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2021 | 9:35 PM

Share

భారతీయ సాంస్కృతిక చిహ్నం చీర. ప్రపంచ దేశాల్లో భారతీయ చీరకట్టుకి ఉన్న ప్రాధాన్యత అత్యంత ప్రాచీన మైనదీ, అత్యంత ప్రత్యేకమైనదీ కూడా. భారతీయతను విశ్వవ్యాప్తం చేసే సాధనమేదైనా ఉందీ అంటే అదిచీరలోని చక్కదనమే. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా…నిండైన చీరకట్టున్న మహిళలను చూసిన వాళ్ళెవరైనా… వాళ్ళు భారతీయులని గుర్తుపట్టేస్తారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేస్తారు. చీరకట్టులోని మర్యాద అది. ప్రపంచవ్యాప్తంగా చీరకున్న గౌరవమది. అంత గొప్పది కాబట్టే అగ్గిపెట్టేలో పట్టే చీరని బహూకరించి అదరహో అనిపించుకున్న చరిత్ర మన నేతన్నలది. పట్టుపీతాంబరాలు మొదలుకొని సాధారణ నేత చీర వరకూ ఏ చీరకట్టినా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చీరకూ, చీరకట్టిన మహిళ నమ్రతకు నమస్కారం చేస్తారు ప్రపంచ ప్రజలంతా.

నాటి ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని నేటి నిర్మలా సీతారామన్‌ వరకూ ఏ దేశమేగినా చీరకట్టు మారలేదు. భారతీయత వన్నె తగ్గలేదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ, గుళ్ళకీ, గోపురాలకీ వెళ్ళాలంటే చీరలు కుచ్చిళ్ళు సవరించాల్సిందే. అది పట్టు చీరైనా, నేత చీరైనా చీరకుండే ప్రత్యేకత చీరదే. చీరకట్టులోని అందాన్ని ఏ మోడ్రన్‌ డ్రెస్సూ ఇంతవరకు బీట్‌ చేయలేదు. అంతెందుకు చీర అందాన్ని వర్ణించని కవి ఉండడంటే అతిశయోక్తి కాదు. నండూరి వారి నుంచి మొదలుకొని ఎందరో కవులు పల్లె పడుచు అందాలకు, చెంగావి చీరల్లోని అందచందాలకు మైమరచిపోయారు. చీరలోని గొప్పతనం తెలియజెప్పారు.

ఇంతందాన్ని తనలో దాచుకున్న చీర వన్నెతగ్గుతోందా? లేక తెచ్చిపెట్టుకున్న ఆధునికత చీరలోని గొప్పదనాన్ని చిన్నబుచ్చుతోందా? ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ చర్చంతా ఎందుకనుకుంటున్నారా?. చీర స్మార్ట్‌ డ్రెస్‌కిందకి రావట్లేదంటూ ఢిల్లీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ సర్టిఫికేట్ ఇచ్చింది. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ విలువని మన దేశంలోనే, ఇంకా చెప్పాలంటే దేశ రాజధానిలోని సదరు రెస్టారెంటు నడివీధిలోకి నెట్టేయడంతో చీరకట్టుపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది.

దేశ రాజధాని ఢిల్లీలోని సదరు రెస్టారెంట్‌ పేరు అక్విల రెస్టారెంట్‌. చీరకట్టుకున్న నేరానికి ఓ మహిళను లోనికి రాకుండా అడ్డుకోవడం ఈ చర్చను తెరపైకి తెచ్చింది. అనితా చౌదరి అనే ఓ జర్నలిస్టు తన కూతురు పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకోవడానికని ఢిల్లీలోని అన్సాల్‌ ప్లాజాలో ఉన్న అక్విలా రెస్టారెంట్‌కి వెళ్ళారు. నిండుగా చీరకట్టుకుని వెళ్ళిన పాత్రికేయురాలిని గేటుదగ్గరే అడ్డుకున్నారు రెస్టారెంట్‌ సిబ్బంది. చీరకట్టుకున్న వాళ్ళను లోనికి అనుమతించమని, చీర స్మార్ట్‌ డ్రస్‌ కిందకి రాదని తేల్చి చెప్పేశారు హోటల్‌ సిబ్బంది.

చీరకట్టుకోవడం ఏ విధంగా నేరం? చీరకట్టుకుంటే రెస్టారెంట్‌లోకి ఎందుకు రానీయరు? అలా అని ఎక్కడ రాసివుందో చూపించండి అంటూ ఆ జర్నలిస్టు నిలదీయడంతో, స్మార్ట్‌ క్యాజువల్స్‌లోనే రెస్టారెంట్‌లోకి అనుమతిస్తామని, చీరలు స్మార్ట్‌ క్యాజువల్‌ డ్రెస్‌ల కోవలోకి రావంటూ చీరలు పాతచింతకాయపచ్చడని తేల్చిపారేశారు రెస్టారెంట్‌ సిబ్బంది. దీన్నంతా వీడియో రికార్డింగ్‌ చేశారు జర్నలిస్టు అనితా చౌదరి. భారతీయులు ఉన్నతంగా భావించే చీరని కట్టుకున్నందుకు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ, తను రికార్డు చేసిన 16 సెకండ్ల వీడియోని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో రెస్టారెంట్‌ పరువు రచ్చకెక్కింది.

‘భారతీయ సాంప్రదాయక వస్త్రమైన చీర ఇప్పుడు స్మార్ట్‌ దుస్తుల కిందకి రాదు. స్మార్ట్‌ ఔట్‌ఫిట్‌కి ఖచ్చితమైన నిర్వచనమేమిటో నాకు చెప్పండి. అప్పుడు నేను చీరకట్టుకోవడం మానేస్తాను. నా జీవితంలో నాకు జరిగిన అన్ని అవమానాల కంటే చీర కారణంగా నాకు జరిగిన అవమానమే చాలా పెద్దది. ఇది నా హృదయాన్ని కలచివేస్తోం’ అంటూ అనితా చౌదరి ఫేస్‌బుక్‌లో పెట్టారు.

అంతేకాదు. చీరకట్టుకోవడం మానేయాలంటే స్మార్ట్‌ దుస్తులకు సరైన నిర్వచనం చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‌ను ట్యాగ్‌ చేశారు అనితా చౌదరి.

నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్విలా రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. సదరు రెస్టారెంట్‌ లైసెన్స్‌ని రద్దు చేయాలంటూ మండిపడుతున్నారు. ఇంత జరిగినా రెస్టారెంట్‌ యాజమాన్యం దిగొచ్చి, జరిగిన తప్పుకి లెంపలేసుకోవాల్సింది పోయి, కస్టమరే తమ సిబ్బందిపై చేయిచేసుకున్నరనీ, అసలు వాళ్ళు రెస్టారెంట్‌లో టేబుల్‌ ముందుగా రిజర్వు చేసుకోకుండా వచ్చారంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు.

ముందుగా రిజర్వు చేసుకోకుండా రెస్టారెంట్‌కి రావడం వల్ల వాళ్ళని ఎక్కడ కూర్చోపెట్టాలో తెలియని హోటల్‌ సిబ్బంది రెస్టారెంట్‌లోకి స్మార్ట్‌ ఫిట్‌కాని చీరలతో అనుమతించమంటూ అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. చివరకు ఆకులు కాలాక చేతులు పట్టుకున్నట్టు సదరు రెస్టారెంట్‌ సిబ్బంది చేసిన తప్పిదానికి తాము క్షమాపణలు కోరుతున్నామనీ, భారతీయ సాంప్రదాయక దుస్తులపట్ల తమకు అమితమైన గౌరవం ఉందనీ, ఎత్నిక్‌ వేర్‌ నుంచి వెస్ట్రన్‌ వేర్‌ వరకు ఏ డ్రెస్సుల్లోనైనా ఈ రెస్టారెంట్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామంటూ చేసిన తప్పుని సర్దుకున్నారు సదరు రెస్టారెంట్‌ యాజమాన్యం.

Also Read:గండరగండడు.. రియల్‌ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు

మనిషి రక్తం మితిమీరి తాగింది.. చివరకు పొట్ట పగిలిపోయింది

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా