Iron Biby: గండరగండడు.. రియల్‌ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు

కండల వీరుడు....గండరగండడు... బాహుబలి.... గ్రాఫిక్స్‌తో కాదు...నిజంగానే...ఎంతటి బరువైనా ఈయనకు కొనగోటితో సమానం. ప్రపంచంలోని అత్యంత బలవంతుల్లో ఈయనొకరు. ఇంతకీ ఈ అభినవ బాహుబలి కథేంటి? తెలుసుకుందాం పదండి.

Iron Biby: గండరగండడు.. రియల్‌ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు
Iron Biby


అరచేతిని అడ్డుపెట్టి కుప్పకూలిపోతోన్న బల్లాల దేవుడి విగ్రహాన్ని నిలబెట్టినట్టు.. భూమిని పెకిలించి శివలింగాన్ని భుజాలకెత్తుకున్నట్టు… గ్రాఫిక్స్‌తో కాదు,  నిజంగా క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తాడీ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ రియల్‌ బాహుబలి.  ఐరన్‌ బిబీగా పిలుచుకునే అహ్మద్‌ అల్‌-హాసన్‌ సనౌ ది సినిమా కాదు. నిజ జీవితం. ఈ అభినవ బాహుబలి జెయింట్స్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఏకంగా 229 కేజీల బరువును ఎత్తిపడేసి షెహబాస్‌ అనిపించుకున్నాడు. 300 కేజీల బరువులెత్తడమే తన లక్ష్యమంటోన్న అహ్మద్‌ – హాసన్‌ బుర్కినా పాసో దేశస్తుడు. మనోడి పవర్‌ లిఫ్టింగ్‌కి మహామహులే పరేషాన్‌ కావాల్సొచ్చింది.

అహ్మద్‌ అల్‌ హసన్‌ కష్టపడి ఈ బాడీని బిల్డప్‌ చేశాడనుకుంటే పొరబడ్డట్టే. 1990, ఏప్రిల్‌ 20న జన్మించిన ఐరన్‌ బిబీ పుట్టుకతోనే బాహుబలి. పుట్టినప్పుడే ఐదు కేజీల బరువున్న అహ్మద్‌ హసన్‌ని చూసి అంతా నవ్వుకునేవారట. చిన్నప్పట్నుంచీ బొద్దుగా ఉండే ఇతను ఇంట్లోనూ, బడిలోనూ, తన వయసు వారికన్నా భిన్నంగా కనిపించేవాడు. స్కూల్‌లో అంతా గేళిచేసే ఈ బుడతడు తనదేశం గర్వించదగ్గ పవర్‌ లిఫ్టర్‌ని అవుతానని కలలో కూడా ఊహించి ఉండడు. అంతా ఫ్యాట్‌ బాయ్‌ అంటూ హేళన చేసే ఈ అభినవ బాహుబలి పవర్‌ లిఫ్టింగ్‌ పవర్‌ చూసేందుకు ఇప్పుడు జనం తండోపతండాలుగా వస్తుంటారు. భవనాలను నిలబెట్టే అత్యంత బరువైన స్థంభాలను రెండు చేతుల్తో పట్టుకుని అవలీలగా లాగేస్తాడీ గండరగండడు.

చూడ్డానికి ఓ నిండు కొండలా ఉన్న హసన్‌ బరువులెత్తడమే కాదు, బరువులతో పాటు వేగంగా పరుగులెత్తడంలో కూడా ఆరితేరాడు. నిజానికి ఆ శరీరంలో వాడి వేడి తగ్గని వేగం…అతనికి ఓ వరం అంటారు నిపుణులు. 2017 నుంచి ఇంటర్నేషనల్‌ స్ట్రాంగ్‌ మాన్‌గా నిలిచాడీ అహ్మద్‌ అల్‌ హసన్‌. చిన్నప్పటి నుంచి అథ్లెట్‌ కావాలనుకున్న హసన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ని సోదరుడితో కలిసి ఇంట్లోనే సాధన చేశాడు. టైర్లు, రాళ్ళు ఎత్తుతూ, ట్రక్కులు లాగుతూ ఈయన చేసిన సాధన ఫలించి యిప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచాడు.

2009లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళడంతో బుర్కినా పాసో దేశానికి చెందిన హసన్‌ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. బరువు తగ్గడం కోసం జిమ్‌లో జాయిన్‌ అయిన హసన్‌ బరువులెత్తడం బెటర్‌ అని భావించాడు. 2013లో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో పాల్గొని తొలి విజయం సాధించిన హసన్‌ అదే యేడాది తొలిసారి పవర్‌లిఫ్టింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ కొట్టేశాడు. దీంతో ఐరన్‌ బిబీగా హసన్‌ పాపులర్‌ అయ్యాడు.

Also Read: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. సూపర్ ఫ్రూట్ సీతాఫలం.. ఎన్నో ప్రయోజనాలు

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu