AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Red Fort Blast: ‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం..’ కేబినెట్ మీటింగ్‌లో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు

Delhi Red Fort Blast: PM Modi convenes crucial Cabinet Committee on Security meeting: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. దాడులకు సూత్రధారులైన వారిని కఠినంగా శిక్షిస్తామని బుధవారం (నవంబర్‌ 12) జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు..

Delhi Red Fort Blast: 'ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం..' కేబినెట్ మీటింగ్‌లో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
PM Modi convenes crucial Cabinet Committee on Security meeting
Srilakshmi C
|

Updated on: Nov 12, 2025 | 8:46 PM

Share

ఢిల్లీ, నవంబర్ 12: ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం (నవంబర్‌ 12) సమావేశం జరిగింది. ఢిల్లీ పేలుడు మృతులకు కేబినెట్‌ నివాళి అర్పించింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. దాడులకు సూత్రధారులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ సమావేశం తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు NSA అజిత్‌ దోవల్‌తో ప్రధాని సమావేశమయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనపై చర్చించారు. పేలుళ్ల మృతులకు నివాళి అర్పించారు.

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు ప్రధాని మోదీ. దాడులకు సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 200 ప్రాంతాల్లో సైన్యం సోదాలు నిర్వహించింది. ఈ రోజు నిర్వహించిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్‌ మిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎగుమతులకు రూ.25,060 కోట్ల ప్రోత్సాహకం, ఎగుమతిదారుల కోసం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్ కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఘటనను ఉగ్రదాడిగా కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఢిల్లీ పేలుడు మృతులకు కేబినెట్ సంతాపం తెలిపింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన కేంద్ర కేబినెట్.. ఉగ్రవాదం పై పోరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

కాగా నవంబర్ 10 సాయంత్రం 6.52 గంటలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన భారీ కారు పేలుడులో 12 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. ఆ కారును హ్యుందాయ్ ఐ20 కారుగా గుర్తించారు. నవంబర్ 12న భూటాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ LNJP ఆసుపత్రిలో పేలుడులో గాయపడిన వారిని కలిశారు. వైద్యులు, అధికారులు ఆయనకు పరిస్థితి గురించి వివరించారు. ఢిల్లీలో జరిగిన పేలుడు సమయంలో LNJP ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కుట్ర వెనుక ఉన్న వారు ఎవరైనా వదిలిపెట్టం అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..