ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఎగిరిన డ్రోన్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వెబ్ సిరీస్ పై కేసు

| Edited By: Phani CH

Aug 04, 2021 | 7:52 PM

ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) సమీపంలో ఎగురుతున్న డ్రోన్ ను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం లోని 188 సెక్షన్ కింద కేసు పెట్టారు.

ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఎగిరిన డ్రోన్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వెబ్ సిరీస్ పై కేసు
Delhi Fort
Follow us on

ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) సమీపంలో ఎగురుతున్న డ్రోన్ ను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం లోని 188 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఓ వెబ్ సిరీస్ షూట్ కి ఈ ప్రాంతంలో మొదట అనుమతినిచ్చినప్పటికీ ఇక్కడ డ్రోన్ ఎగురవేయడానికి అనుమతి లేదు.. కానీ తమ పర్మిషన్ లేకుండా దీన్ని ఎలా ఎగురవేశారంటూ ఈ వెబ్ సిరీస్ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ఈ నెల 15 న ఇండిపెండెన్స్ డే ని జరుపుకోనున్న సందర్భంగా ఇప్పటికే భద్రతను పలు చోట్ల కట్టుదిట్టం చేశారు. పైగా ఢిల్లీకి-ముఖ్యంగా ఎర్రకోట వద్ద ఏరియాకు సంబంధించి పలు సెక్యూరిటీ హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. రానున్న రోజుల్లో రెడ్ ఫోర్ట్ పై ఎగురవేసేందుకు పాకిస్తాన్ టెర్రరిస్టులు డ్రోన్లను వినియోగించుకోవచ్చునని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని అందజేశాయి. ఇంతేగాక జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసి ఈ నెల 5 తో రెండేళ్లు పూర్తి అవుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా ఉగ్రవాదులు ఎర్రకోటను టార్గెట్ చేయవచ్చునని అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో నాలుగు యాంటీ డ్రోన్ సిస్టం లను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది రెండింటినే పెట్టారు. అటు- ఈ నెల 15 వరకు ఎర్రకోట వద్దకు ఎంట్రీని ప్రభుత్వం నిషేధించింది. అసలే జమ్మూలో ఇటీవలి కాలంలో మళ్ళీ డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో ముఖ్యంగా ఎర్ర కోట వద్ద డ్రోన్ ఎగరడం ఆందోళన కలిగిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Space Tourists: అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లి వచ్చిన రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్‌లు ఆస్ట్రోనాట్స్ కాదా? ఎందుకు?

Prabhas – Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?