Prabhas – Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలగురించి రోజూ ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో లేదంటే ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

Prabhas - Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?
Nag Ashwin
Follow us

|

Updated on: Aug 04, 2021 | 7:28 PM

Prabhas – Nag Ashwin movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి రోజూ ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో లేదంటే.. ఫిలిం సర్కిల్స్‌‌‌‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను లైన్‌‌‌‌లో పెట్టిన రెబల్ స్టార్ట్ ఆయా సినిమాల షూటింగ్‌‌‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్  డైరెక్షన్‌‌‌లో ఆదిపురుష్ కూడా పట్టాలెక్కింది. వీటన్నింటితోపాటు మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తుంది. టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించిన మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌‌‌తోపాటు ఈ మూవీలో మరో ఇద్దరు హీరోలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్ట్ కే లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ ఇద్దరితోపాటు ఇతరభాషలకు చెందిన హీరోలు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్