AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Space Tourists: అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లి వచ్చిన రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్‌లు ఆస్ట్రోనాట్స్ కాదా? ఎందుకు?

ఇద్దరు అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్ జూలైలో తమ వ్యక్తిగత అంతరిక్ష నౌకలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇద్దరూ వరుసగా అంతరిక్షానికి వెళ్ళిన ప్రపంచంలో మొదటి , రెండవ బిలియనీర్లుగా రికార్డులకెక్కారు.

Space Tourists: అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లి వచ్చిన రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్‌లు ఆస్ట్రోనాట్స్ కాదా? ఎందుకు?
Space Tourists
KVD Varma
|

Updated on: Aug 04, 2021 | 7:50 PM

Share

Space Tourists: ఇద్దరు అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్ జూలైలో తమ వ్యక్తిగత అంతరిక్ష నౌకలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇద్దరూ వరుసగా అంతరిక్షానికి వెళ్ళిన ప్రపంచంలో మొదటి , రెండవ బిలియనీర్లుగా రికార్డులకెక్కారు.  ఈ విజయం సాధించినప్పటికీ, బెజోస్, బ్రాస్నన్‌లను వ్యోమగాములు (ఆస్ట్రోనాట్స్) అని పిలవవచ్చా? అలా అనకూడదు అంటోంది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరి వారిని ఏమనాలి? ఇది కూడా చెప్పింది ఎఫ్ఏఏ.. అంతరిక్ష పర్యాటకుడు (స్పేస్ టూరిస్ట్) అని మాత్రమే పిలవాలట. ఎందుకు అలా పిలవాలని అంటున్నారో తెలుసుకుందాం.

జూలై 11 న, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాస్నన్ మరియు జూలై 20 న, బ్లూ ఆరిజిన్ యజమాని జెఫ్ బెజోస్ తన కంపెనీ నిర్మించిన రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ సమయంలో వారిని వ్యోమగాములుగానే పిలిచారు. అయితే, ఆ తరువాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తన నిబంధనలు మార్చింది. దాని ప్రకారం వారిని ఇప్పుడు స్పీడ్ టూరిస్ట్ అనే పిలవాల్సి ఉంటుంది.

బెజోస్ , బ్రాస్నన్ పాత నిబంధన ప్రకారం వ్యోమగాములుగా పిలిచారు. ఎందుకంటే అంతరిక్ష ప్రయాణానికి ఎఫ్ఏఏ అన్ని ప్రమాణాలను వారు అందుకున్నారు. ఈ ప్రమాణాల ప్రకారం వ్యోమగామిగా పిలవాలంటే కనీసం 50 మైళ్ల (80.46 కిమీ) ఎత్తుకు ఎగరాలి. ఈ ఇద్దరూ ఆ ఎత్తును దాటారు. అయితే, ఇప్పుడు ఎఫ్ఏఏ నిబంధనలు మార్చింది.  2004 లో ఎఫ్ఏఏ స్థాపించిన తర్వాత స్పేస్ నిబంధనలను మార్చడం ఇదే మొదటిసారి. కొత్త నిబంధనల ప్రకారం, ఎఫ్ఏఏవ్యోమగామి అని పిలవాలంటే మొదట ప్రజా భద్రతా కోసం శిక్షణ సమయంలో నేర్చుకున్న కార్యకలాపాలను విమానంలో నిర్వహించాలి. అంటే.. అంతరిక్షంలోకి వెళ్లే నౌకకు సంబంధించిన సిబ్బందిని మాత్రమే వ్యోమగాములుగా పిలుస్తారు. ప్రజల్ని అంతరిక్షంలోకి జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకు వచ్చే బాధ్యత వారు నిర్వహిస్తారు కాబట్టి వారిని  ప్రోత్సహించడం కోసం ఇలా మార్చారు.

ఇప్పుడు ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు చేసిన అంతరిక్ష యాత్ర వాణిజ్య అంతరిక్ష కార్యకలాపాలకు ఉద్దేశించింది. అందువల్ల ఆ యాత్రలో పాల్గొన్న వారిని పర్యాటకులుగానే పిలవాలని ఎఫ్ఏఏ తన నిబంధనల్లో పేర్కొంది. అయినా ఎఫ్ఏఏ వారిని ‘వాణిజ్య వ్యోమగామి వింగ్స్’ ‘గౌరవ డిగ్రీ’ తో సత్కరిస్తుంది. వాణిజ్య మానవ అంతరిక్ష విమాన పరిశ్రమకు అసాధారణమైన సహకారం లేదా ప్రయోజనకరమైన సేవను ప్రదర్శించిన వ్యక్తులకు టైటిల్ ప్రదానం చేస్తారు.

ఇక ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘కమర్షియల్ వ్యోమగామి వింగ్స్’ చట్టపరమైన ప్రాముఖ్యతను కలిగి లేవు. అలాగే దీనితో గ్రహీతకు ఎలాంటి అధికారాలు ఉండవు.  ఇది కేవలం గుర్తింపు చిహ్నం మాత్రమే.

Also Read: Water Proof Cover: మీ స్మార్ట్‌ఫోన్‌కి ఈ కవర్ వేశారంటే..ఈత కొడుతూ కూడా ఫోటోలు తీసుకోవచ్చు..ఇది ఎలా పనిచేస్తుందంటే..

Moon exploration: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల కన్ను.. విశ్వం రహస్యల గుట్టు విప్పుతుందని ఆశలు