రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయన్న ఢిల్లీ పోలీసులు.!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు ఆదివారం అనుమతి ఇచ్చారు.
Farmers Tractors rally : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు ఆదివారం అనుమతి ఇచ్చారు. విదేశీ ఉగ్రవాదుల కుట్ర నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ స్పెషల్ కమిషనర్ దేపేంద్ర పాథక్ తెలిపారు. జనవరి 26 న జరిగే ర్యాలీని ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించడానికి అంగీకరించామని.. రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. అయితే తిక్రీ సరిహద్దు నుండి, ఇది నాగ్లోయికి వెళ్లి నజాఫ్‌గర్, వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే గుండా ర్యాలీని అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 11సార్లు రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిరసన వ్యక్తం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా భారీగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది. ట్రాక్టర్ ర్యాలీకి పటిష్టమైన భద్రత మధ్య నిర్వహిస్తామని ప్రత్యేక పోలీసు కమిషనర్ (ఇంటెలిజెన్స్) దీపేంద్ర పాథక్ తెలిపారు.
అయితే, రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర జరిగిందని దీపేంద్ర పాథక్ వెల్లడించారు. ఇందుకోసం సుమారు 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారని ఆయన తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరగనున్నట్లు స్పష్టం చేశారు.
‘‘రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్‌లో సుమారు 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివిధ నిఘా వర్గాల ద్వారా తెలిసింది. సవాలుతో కూడినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది’’ అని పాథక్ వెల్లడించారు.
Read Also.. Telangana CM Kcr: పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు.. వారం రోజుల్లోగా..