Tiger: పులితో ఆటలు… వైరల్‌గా మారిన యువకుల వీడియో… ఇలా చేయడం మంచిది కాదంటూ..

ఓవైపు పులులు అడవుల బాటను విడిచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మనుషులపై దాడులకు దిగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు ఇవే పులులపై మనుషులు చేస్తోన్న దాడులు కూడా చూస్తున్నాం..

Tiger: పులితో ఆటలు... వైరల్‌గా మారిన యువకుల వీడియో... ఇలా చేయడం మంచిది కాదంటూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 24, 2021 | 7:50 PM

Tiger Crosses River Video Goes Viral: ఓవైపు పులులు అడవుల బాటను విడిచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మనుషులపై దాడులకు దిగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పులులు మనుషులను చంపిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే మరో వైపు ఇవే పులులపై మనుషులు చేస్తోన్న దాడులు కూడా చూస్తున్నాం. నిన్నటికి నిన్న కేరళలో కొందరు వ్యక్తులు పులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు యువకులు ఆ స్థాయిలో కాకపోయినా పులితో ఆటాడుకున్నారు. నీళ్లలో ఉంది కదా అని దాన్ని వెంబడిస్తూ వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్భాన్‌ అడవికి చెందిన ఓ పులి నదిని దాటుతోంది. ఈ సమయంలో నదిలో ఉన్న కొందరు యువకులు బోటులో అరుస్తూ ఆ పులి దగ్గరకు చేరుకున్నారు. దీంతో భయపడ్డ ఆ పులి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఈ సంఘటనంతా ఆ యువకులు మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్‌ పాండే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇలా ఓ పులి నదిలో ఈదుతూ వెళ్లడం అరుదైన విషయమే అయినప్పటికీ.. పులులు కనిపించినప్పుడు నిశ్శబ్ధంగా ఉంటూ.. వాటికి దూరంగా ఉండడం క్షేమం’ అనే క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆ యువకుల తీరును తప్పుపడుతూ కామెంట్లు చేశారు.

Also Read: Drugs Seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్..