Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడు.. బుచ్చిబాబుకు మళ్లీ నోటీసులు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఆడిటర్ బుచ్చిబాబును విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. దాంతో ఈడీ అడిగిన పత్రాలు, ఆధారాలతో సహా బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యాడు. గతంలో కవితకు ఆడిటర్‌గా పని చేశాడు బుచ్చిబాబు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడు.. బుచ్చిబాబుకు మళ్లీ నోటీసులు..
Delhi Liquor Scam
Follow us

|

Updated on: May 03, 2023 | 1:24 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఆడిటర్ బుచ్చిబాబును విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. దాంతో ఈడీ అడిగిన పత్రాలు, ఆధారాలతో సహా బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యాడు. గతంలో కవితకు ఆడిటర్‌గా పని చేశాడు బుచ్చిబాబు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ మధ్యనే రెండు అదనపు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌లపై ఈ నెల 10వ తేదీన కోర్టులో విచారణ జరుగనుంది. ఈ క్రమంలో బుచ్చిబాబు నుంచి మరిన్ని వివరాలు కోరింది ఈడీ.

బెయిల్ కోసం సిసోడియా పిటిషన్..

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బెయిల్‌ కోసం సిసోడియా పిటిషన్‌ దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా.. బుధవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గురువారం లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సిసోడియా భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. భార్య బాగోగులు చూసేందుకు బెయిల్ ఇవ్వాలంటూ సిసోడియా తన పిటిషన్‌లో కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..