Electric Vehicles: ఇక నుంచి సులభం కానున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ .. ప్రతి 3 కిలో మీటర్లకు ఓ ఛార్జింగ్ పాయింట్..
ఓ వైపు కాలుష్యం, మరోవైపు చమురు ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలు పెట్రో, డీజిల్ వెహికల్స్ వాడకాన్ని తగ్గించి.. వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకంవైపు అగుడులు వేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఛార్జింగ్ పెట్టడం సమస్యగా..
Electric Vehicles: ఓ వైపు కాలుష్యం, మరోవైపు చమురు ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలు పెట్రో, డీజిల్ వెహికల్స్ వాడకాన్ని తగ్గించి.. వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకంవైపు అగుడులు వేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఛార్జింగ్ పెట్టడం సమస్యగా మారింది. కేవలం ఇళ్ల వద్ద రాత్రి సమయాల్లో ఛార్జింగ్ పెట్టుకుని వాడాల్సి వస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ఈసమస్యను అధిగమించడానికి దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి ఉండేలా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ముందుగా దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనదారుల సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఢిల్లీలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈవిషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ వెల్లడించారు. 2024 నాటికి ఢిల్లీలో మొత్తం వాహనాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల సమయం వృధా అయినప్పటికి.. లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు.. వాహన వినియోగదారులకు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేయడం ఎంతో ముఖ్యమని రవాణా శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో 2వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని.. మరో 100 స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేముందు వినియోగదారులు ఛార్జింగ్ పాయింట్ల కోసం ఆలోచిస్తున్నారని అందుకే ఈసమస్యను అధిగమిస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటామని తెలిపారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వాహనం ప్రయాణించే రేంజ్ పైపా సమస్యలున్నాయని.. తయారీదారులు దీనిపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..