Lawrence Bishnoi Gang: తీహార్ జైలులో కత్తులతో పొడుచుకున్న గ్యాంగ్‌స్టర్స్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు మృతి..

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ప్రిన్స్ తెవాటియా ఢిల్లీలోని తీహార్ జైలులో హత్యకు గురయ్యాడు. జైలులోనే పలుమార్లు కత్తిపోట్లకు గురయ్యాడు.

Lawrence Bishnoi Gang: తీహార్ జైలులో కత్తులతో పొడుచుకున్న గ్యాంగ్‌స్టర్స్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు మృతి..
Lawrence Bishnoi Gang
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 14, 2023 | 9:05 PM

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు హత్యకు గురయ్యాడు.  ప్రిన్స్ తెవాటియా శుక్రవారం (ఏప్రిల్ 14) తీహార్ జైలులో మరణించాడు. గ్యాంగ్ వార్‌లో కత్తి దాడిలో ప్రైస్ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రిన్స్ హత్యను రోహిత్ చౌదరి గ్యాంగ్ చేసిందని ఆరోపించారు. జైలులో జరిగిన గ్యాంగ్ వార్‌లో మరో ముగ్గురు గాయపడ్డారని జైలు వర్గాలు తెలిపాయి. అతడిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రి (డీడీయూ)కి తరలించారు. అయితే, తీహార్ జైలులోని 3 మూడింటిలో కత్తిపోట్లు జరిగాయి. సమాచారం అందిన వెంటనే తీహార్‌లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీని వెనుక కారణం ఏంటో పోలీసులు ఇంకా చెప్పలేదు.. కానీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, రోహిత్ చౌదరి గ్యాంగ్ మధ్య ఉన్న శత్రుత్వమే గ్యాంగ్ ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

తీహార్ జైలు నంబర్ 3లో సాయంత్రం 5 గంటలకు గ్యాంగ్ వార్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు ఖైదీలు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ దీన్ దయాళ్ ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్స్ తెవాటియా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ గ్యాంగ్ వార్ లో రోహిత్ చౌదరి గ్యాంగ్ పేరు తెరపైకి వస్తోంది.

ప్రిన్స్ తెవాటియాపై 18 క్రిమినల్ కేసులు..

మరణించిన గ్యాంగ్‌స్టర్ ప్రిన్స్ తెవాటియాపై 18కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జైలు నెం-3లో రెండు గ్రూపుల ఖైదీల మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం జరిగింది. ఇందులో చాలా గొడవలు జరిగాయి. ఎవరో పదునైన ఆయుధంతో నలుగురు గ్యాంగ్‌స్టర్లపై దాడి చేశారు. ఇందులో ప్రిన్స్ తెవాటియా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రిన్స్‌పై 7 నుంచి 8 సార్లు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే తీహార్ అధికార యంత్రాంగంలో కలకలం రేగింది. క్షతగాత్రులందరినీ వెంటనే డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ప్రిన్స్ తెవాటియా చికిత్స పొందుతూ మరణించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం