AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేసి చూడగా..

ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లింగ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నిందితులు సరికొత్త విధానాల్లో స్మగ్లింగ్‌లకు పాల్పడుతూ చిక్కుతున్నారు.

Viral: ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేసి చూడగా..
Crime News (representative image)
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2024 | 5:20 PM

Share

ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లింగ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నిందితులు సరికొత్త విధానాల్లో స్మగ్లింగ్‌లకు పాల్పడుతూ చిక్కుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలో వెలుగుచూసింది. ఓ మహిళా ప్రయాణికురాలు ఏకంగా 21 ఐ ఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను దేశాలు దాటించేందుకు ప్రయత్నించి కస్టమ్స్‌ అధికారులకు చిక్కింది. 26.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ ఫోన్లను టిష్యూ పేపర్లలో ఉంచి అక్రమంగా తరలిస్తుండగా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో మంగళవారం మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆమె హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిందని.. ఈ క్రమంలో ఆమెను ఆపి చెక్ చేయగా.. ఈ విషయం బయటపడినట్లు తెలిపారు. వ్యానిటీ బ్యాగ్ లో టిష్యూ పేపర్లలో చుట్టి ఐఫోన్లను తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు అందిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.

ట్వీట్ చూడండి..

ఇదిలాఉంటే.. సోమవారం తెల్లవారుజామున సౌదీ డమ్మామ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణీకుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ బ్యాటరీ ప్రాంతంలో లోపల రెండు బంగారు కడ్డీలను దాచిపెట్టి.. అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 గ్రాముల బరువున్న రెండు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్