Manipur: అంతకంతకూ పెరుగుతోన్న మృతుల సంఖ్య.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

మణిపుర్ (Manipur) లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 20 మృత్యువాతపడగా.. తాజాగా మరో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయి. నోనీ జిల్లాలో రైలు మార్గం...

Manipur: అంతకంతకూ పెరుగుతోన్న మృతుల సంఖ్య.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
Manipur
Follow us

|

Updated on: Jul 02, 2022 | 6:57 PM

మణిపుర్ (Manipur) లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 20 మృత్యువాతపడగా.. తాజాగా మరో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయి. నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ప్రస్తుతం వెలికితీసిన వారితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 27కు చేరింది. వీరిలో 20 మంది జవాన్లు, ఏడుగురు పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించింది. శిథిలాల కింద ఇంకా 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తుపుల్ రైల్వే యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలోనే మరో చోట కొండచరియ విరిగిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు రోజుల క్రితం మణిపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. 45 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ ఆపరేషన్‌ చేపడుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటన గురించి ఆర్మీ అధికారులు మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 19 మందిని రక్షించాం. క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాం. ఏడుగురి మృత దేహాలు’ లభ్యమయ్యాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles