Crime News: ఆస్తి తగాదాలు.. మాజీ మంత్రి కోడలు, మనవరాలిని దారుణంగా చంపిన దుండగులు..
Crime News: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దివంగత నేత చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి డీపీ ధ్రిత్‌లహ్రే కోడలు(30), తొమ్మిదేళ్ల మనవరాలు..
Crime News: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దివంగత నేత చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి డీపీ ధ్రిత్‌లహ్రే కోడలు(30), తొమ్మిదేళ్ల మనవరాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమీప బంధువులే వీరిని చంపినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాయ్‌పూర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దివంగత ధ్రిత్‌లహ్రే కొడుకు తరుణ్ ధ్రిత్‌లహ్రే, కోడలు నేహా ధ్రిత్‌లహ్రే, వారి కూతురు అనన్య(9) రాయ్‌పూర్‌లోని శంకర్‌నగర్‌లో నివాసముంటున్నారు.
అయితే తరుణ్ ధ్రిత్‌లహ్రే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అతని భార్య నేహా, కుమార్తె అనన్యలపై దుండగులు దాడి చేసి చంపేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని చెప్పారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
US police: అమెరికాలో దారుణం.. రెచ్చిపోయిన పోలీస్.. తన ఆదేశాలు వినలేదని 9 ఏళ్ల బాలికను..