AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoists Encounter: 1500 మంది జవాన్లు.. 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌.. చివరకు..

దంతెవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ అత్యంత సీక్రెట్‌గా కొనసాగింది.. మావోయిస్టుల కంట పడకుండా ఉండేందుకు... 1,500 మంది జవాన్లు... పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు బైకులపై ప్రయాణించి ఎత్తయిన కొండ ప్రాంతానికి చేరుకున్నారు.

Maoists Encounter: 1500 మంది జవాన్లు.. 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌.. చివరకు..
Maoist Encounter
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 06, 2024 | 10:11 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్‌ కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి. మృతుల్లో 13మంది మహిళలు, 18మంది పురుషులు ఉన్నారు. వీరిపై రూ 1.30 కోట్ల రివార్డ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి LMG, AK-47, ఇన్సాస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, 303 లాంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఆపరేషన్ రెండు రోజుల పాటు సుధీర్ఘంగా రహస్యంగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు.

దంతెవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ అత్యంత సీక్రెట్‌గా కొనసాగింది.. మావోయిస్టుల కంట పడకుండా ఉండేందుకు… 1,500 మంది జవాన్లు… పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు బైకులపై ప్రయాణించి ఎత్తయిన కొండ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు ఎక్కి.. మావోయిస్టుల క్యాంప్‌పై భీకరంగా విరుచుకుపడ్డారు. భారీ సంఖ్యలో మావోయిస్టులను హతం చేశారు. 48 గంటల పాటు ఈ ఆపరేషన్‌ సాగింది.

అక్టోబర్‌ 3నే ఆపరేషన్‌ షురూ.. పక్కా సమాచారంతో

ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో దండకారణ్యం దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్‌కి చెందిన బలగాలు పాల్గొన్నాయి. వాళ్లకు CRPF జవాన్లు సహకరించారు. పక్కా వ్యూహంతో అక్టోబరు 3 ఉదయమే ఆపరేషన్‌ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులకు చెందిన కంపెనీ నెంబర్‌ 6, తూర్పు బస్తర్‌ డివిజన్‌ దళాలు గవాడి, థుల్‌థులి, నెందూర్‌, రెంగవయా గ్రామాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, దాన్ని ధ్రువీకరించుకున్నాక ఈ ఆపరేషన్‌ చేపట్టామని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్‌కౌంటర్‌ సాగింది.

తెలంగాణ చెందిన వారు లేరు..

మృతి చెందిన మావోయిస్టులను పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీకి చెందిన వారిగా గుర్తించామని బస్తర్‌ రేంజ్ ఐజీ సుందర్‌ రాజ్‌ పేర్కొన్నారు. మృతులు ఇంద్రావతి ఏరియా కమిటీ పీజీ ఎల్ ఏ 6 బెటాలియన్ సభ్యులని.. 16 మందిని గుర్తించామని ఐజీ తెలిపారు. ఇంకా 15 మంది నీ గుర్తించాల్సింది ఉందన్నారు. మృతి చెందిన DKSE సభ్యురాలు ఊర్మిలపై రూ. 20 లక్షల రివార్డ్‌ ఉందన్నారు. అంతేకాకుండా డివిజిన్ కమిటీ సభ్యులు మడకం మీనా, సురేష్ కూడా మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు లేరని వెల్లడించారు. మావోయిస్టుల మృతదేహాలు దంతెవాడకు తరలించారు.

తాజా ఎన్‌కౌంటర్‌తో బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 188కి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 16న కాన్కేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సల్స్‌ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను విడుదల చేయాలన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..