AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dam Safety Bill 2019: ఇకపై రాష్ట్రాలలోని డ్యామ్‌ల సేఫ్టీ బాధ్యత కేంద్రానిదే.. రాజ్యసభలో ఆమోదం పొందిన డ్యామ్ సేఫ్టీ బిల్లు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగో రోజైన గురువారం పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య డ్యామ్ సేఫ్టీ బిల్లు, 2019 రాజ్యసభ ఆమోదించింది.

Dam Safety Bill 2019: ఇకపై రాష్ట్రాలలోని డ్యామ్‌ల సేఫ్టీ బాధ్యత కేంద్రానిదే.. రాజ్యసభలో ఆమోదం పొందిన డ్యామ్ సేఫ్టీ బిల్లు..
Dam Safety Bill 2019
KVD Varma
|

Updated on: Dec 02, 2021 | 8:39 PM

Share

Dam Safety Bill 2019: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగో రోజైన గురువారం పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య డ్యామ్ సేఫ్టీ బిల్లు, 2019 రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుపై రాజ్యసభలో నాలుగు గంటల పాటు చర్చ జరిగింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు డ్యామ్‌ సేఫ్టీ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డ్యామ్ సేఫ్టీ బిల్లు భారతదేశంలోని నిర్దేశిత డ్యామ్‌ల పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ కోసం కేంద్ర నియంత్రణ సంస్థ ద్వారా జరిగే అవకాశం ఇస్తుంది. ఈ బిల్లు పరిధిలో 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు లేదా 10-15 మీటర్ల ఎత్తు ఉన్న ఆనకట్టలు, నిర్దిష్ట డిజైన్, నిర్మాణంతో కూడిన ఆనకట్టలు ఉంటాయి.

చర్చ అనంతరం రాజ్యసభలో ఆమోదం..

బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం రాజ్యసభలో ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు, డ్యామ్ భద్రత బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు 42 డ్యామ్‌లు తెగిపోయాయని అన్నారు. ఈ బిల్లును 2010లో తీసుకురావాలని చర్చ జరిగింది. 2019 ఆగస్టులో లోక్‌సభ ఆమోదించింది. ఈ చట్టాన్ని వెంటనే రూపొందించాలి. స్టాండింగ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ బిల్లును రూపొందించారు. బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాల్లోని రాష్ట్ర కమిటీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని కేంద్ర మంత్రి షెకావత్ ప్రతిపక్ష ఎంపీలకు కూడా హామీ ఇచ్చారు.

డ్యామ్‌లపై నిబంధనలు రూపొందించే హక్కు కేంద్రానికి లేదు: ప్రతిపక్షం

బిల్లుపై చర్చ సందర్భంగా గురువారం ప్రతిపక్ష ఎంపీలు డ్యామ్ సేఫ్టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్యాం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నిబంధనలు రూపొందించలేదని ఎంపీలు అన్నారు. డ్యామ్‌ల భద్రతను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని, వాటిని నిర్వహిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), కాంగ్రెస్ వంటి పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు తెలిపారు.

డ్యామ్‌ సేఫ్టీ బిల్లును పాస్‌ చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. డ్యామ్‌ల భద్రతను నిర్ధారించడానికి బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని, డ్యామ్‌లు సక్రమంగా పనిచేసేలా భద్రతా తనిఖీలు చేయవచ్చని ఆయన అన్నారు.

Pregnancy Care: గర్భధారణ సమయంలో చురుకుగా ఉంటే.. ప్రసవ సమయంలో శక్తివంతంగా ఉంటారు.. ప్రసవవేదన తగ్గుతుంది!

Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..

Omicron: ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలిసేది అప్పుడే.. టేకిటీసీ పాలసీ ముప్పు తెస్తుంది..బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక!