Omicron Variant: ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత మందికి వచ్చిందంటే..

Omicron Variant: ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత మందికి వచ్చిందంటే..
Omicron Diagnosed

ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 373 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టడానికి అంతర్జాతీయ విమానశ్రాయాల్లో టెస్ట్‌ల సంఖ్యను పెంచినట్టు కేంద్రం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా పాజిటివ్‌ వస్తే..

Sanjay Kasula

|

Dec 02, 2021 | 8:59 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి ఎంట్రీ వచ్చింది. బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నిర్ధారణ కావడం హడలెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్‌ బారినపడ్డవారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు. వీరిలో ఒకరు విదేశీయుడు ఉన్నారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు చేశామని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చాయి.

బెంగళూర్‌లో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వాళ్ల గురించి హడలెత్తించే విషయం వెలుగు లోకి వచ్చింది. విదేశాలకు ప్రయాణం చేయకుండానే స్థానికుడైన హెల్త్‌ వర్కర్‌కు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకడం కలవరపెడుతోంది. అతడితో కాంటాక్ట్‌లో ఉన్న ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్స్‌ను జీనమ్‌ సీక్వెనింగ్‌ కోసం పంపించారు.

ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన ఇద్దరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ ఇద్దరినికి కలిసిన వాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించామని , క్వారంటైన్‌ చేశామని వెల్లడించారు. ఈనెల 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి తొలుత ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది . అతడు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికి ఒమిక్రాన్‌ సోకింది. వారం రోజుల తరువాత నెగెటివ్‌ రావడంతో అతడు దుబాయ్‌ వెళ్లిపోయాడు.

డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాపిస్తుందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు లవ్‌ అగర్వాల్‌. యూరప్‌లో ఒక్క నెల లోనే 70 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని , ప్రజల నిర్లక్ష్యం తోనే అలా జరిగిందన్నారు. భారత్‌లో ఈ పరిస్థితి రాకుండా ప్రజలు విధిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని , మాస్క్‌లు ధరించాలని , భౌతికదూరం పాటించాలని కోరారు లవ్‌ అగర్వాల్‌.

భారత్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు ఆరోగ్యశాఖ అధికారులు. అసలు వ్యాక్సిన్‌ తీసుకోని వాళ్లకు , సింగిల్‌ డోసు తీసుకున్న వాళ్లకు మాత్రమే దక్షిణాఫ్రికాలో వేగంగా ఒమిక్రాన్‌ సోకుతున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 373 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టడానికి అంతర్జాతీయ విమానశ్రాయాల్లో టెస్ట్‌ల సంఖ్యను పెంచినట్టు కేంద్రం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా పాజిటివ్‌ వస్తే వెంటనే జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపిస్తునట్టు తెలిపింది. నెగెటివ్‌ వచ్చిన వాళ్లకు వారం రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌ను కంపల్సరీ చేశారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌ కోసం దేశవ్యాప్తంగా 37 ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.

30 దేశాలకు విస్తరించిన కేసులు

సౌతాఫ్రికా-183 ఘనా-33 యూకే-32 బోట్స్ వానా-19 నెదర్లాండ్స్-16 పోర్చుగల్13 ఆస్ట్రేలియా-8 హాంకాంగ్-7 కెనడా-7 డెన్మార్క్-06 ఇటలీ-4 ఆస్ట్రియా-04 స్వీడన్-04 సౌత్ కొరియా-03 నైజీరియా-03 స్విట్జర్లాండ్-3 ఇజ్రాయెల్-2 బ్రెజిల్-02 జపాన్-2 బెల్జియం-2 స్పెయిన్-2 నార్వే-02 ఇండియా-02 అమెరికా-01 సౌదీ అరేబియా-01 ఐర్లాండ్-01 ప్రాన్స్-01 చెచియా-01 యూఏఈ-01

బూస్టర్‌ డోస్‌ విషయంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని , దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యమన్నారు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu