Cyclone Tauktae Tracker and Updates: కేరళను కమ్మేసిన తౌక్తా.. భారీగా కురుస్తున్న వర్షాలు… రంగంలోకి దిగిన NDRF బృందాలు..
తౌక్తా తుఫాన్ విరుచుకుపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
Cyclone Tauktae: తౌక్తా తుఫాన్ విరుచుకుపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తౌక్తా ప్రభావం అప్పుడు కేరళపై కనిపిస్తోంది. తీర ప్రాంతంలో జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కవగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. త్రిశూర్‌లో చాలా గ్రామాలు నీట మునిగాయి. తుఫాన్ ప్రభావం కారణంగా కేరళతో పాటు లక్ష్యద్వీప్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని త్రిశూర్.ఇడుక్కి, పాలక్కాడ్, మల్లాపురం , కోజికోడ్, వయనాడ్ , కన్నూరు . కాసరఘడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఓవైపు దేశం కరోనా కల్లోలంతో అల్లాడుతుంటే.. తీర ప్రాంతంలోని రాష్ట్రాలు మాత్రం వేగంగా దూసుకొస్తున్న తౌక్తా తుఫాన్ దాటికి వణికిపోతున్నారు. మరో 8 గంటల్లో తీవ్రతుఫానుగా మారుతుందని IMD హెచ్చరికలు జారీ చేసింది. గోవాకు 350 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రంగా అధికారులు గుర్తించారు. గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతోందని తెలిపారు. ఈనెల 18న గుజరాత్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లక్ష్మద్వీప్‌లో ఏర్పడ్డ తుఫాన్ కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకవేళ తౌక్తా తుఫాన్ భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది ఇదే తొలి తుఫాన్ అవుతుంది.
కేరళ తీరంలో చిక్కుకున్న ముగ్గురు మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ అధికారులు రక్షించారు. చేపలవేటకు వెళ్లి వస్తుండగా బోట్ మొరాయించడంతో సముద్రంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. తుఫాన్‌తో అల్లకల్లోలంగా సముద్రం మారండంతో కోస్ట్‌గార్డ్ వెంటనే రంగంలోకి దిగింది. ముగ్గురు జాలర్లను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
తౌటే తుఫాన్ ప్రభావంతో కేరళ, గోవా, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే బారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌కు ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను హుటాహుటిన పంపించింది కేంద్రం. ఒడిశా నుంచి ప్రత్యేక విమానాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను గుజరాత్‌కు పంపించారు.
తౌక్తా తుఫాన్‌పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్షను నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగే సమావేశానికి ఎన్‌డీఎంఏ అధికారులు హాజరవుతున్నారు. తౌటే తుఫాన్ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎఫెక్ట్ ఉందని అలర్ట్ జారీ చేశారు. 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారుల హెచ్చరిక జారీ చేశారు.
సహాయక చర్యల కోసం 53 బృందాలను రంగంలోకి దించింది ఎన్డీఆర్‌ఎఫ్. కర్నాటక పశ్చిమతీరం, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని త్రిశూర్ సహా 7 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఉంది. కేరళ కొల్లాం జిల్లాలో నేలకూలాయి న చెట్లు. వయనాడ్, ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, కన్యాకుమారి, నీలగిరి జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షాలు పేచీపరై డ్యామ్ నిండిపోయింది. తమిళనాడులో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాయలసీమలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.