School Holidays: ఆ 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం!

School Holiday: ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 9 జిల్లాల పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. రేపు ఆదివారం సాధారణంగా సెలవు. 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అక్కడ ప్రభుత్వం.. పరిస్థితి అలాగే ఉంటే సోమవారం కూడా సెలవు..

School Holidays: ఆ 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 30, 2024 | 12:55 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంచల్ తుఫాను కారణంగా తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 9 జిల్లాల పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. రేపు ఆదివారం సాధారణంగా సెలవు. 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అక్కడ ప్రభుత్వం.. పరిస్థితి అలాగే ఉంటే సోమవారం కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, మైలాడుతురై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, రాణిపేటైలో నిరంతర వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే తంజావూరు జిల్లాలో కుంభకోణం, తిరువిడైమరుదూర్ తాలూకాలలో కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించారు.

అయితే తుఫాను కారణంగా పాఠశాల, కళాశాలలకు మరిన్ని సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో చర్చలు జరుపుతోంది. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి వెళ్లే విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంచల్ తుఫాను:

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను “ఫెంజాల్” గత 6 గంటల్లో గంటకు 07 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాన్ని కారైకాల్, పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం మధ్య దాటే అవకాశం ఉందని, నవంబర్ 30 మధ్యాహ్నం సమయంలో గంటకు 70-80 కి.మీ నుండి 90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, దాదాపు పశ్చిమ వాయువ్య దిశలో కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. .

బయటకు రాకూడదు:

తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అత్యవసర పనులకు మినహా ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లకుండా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

6 జిల్లాలకు రెడ్ అలర్ట్:

అలాగే, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాలు, రాణిపేట్, తిరువణ్ణామలై, వేలూరు, పెరంబలూరు, అరియలూరు, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం జిల్లాలు, హేకరాయ్‌లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నామక్కల్, తిరుచిరాపల్లి, పుదుకోట్టై, కరూర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి