Fengal Cyclone: బీభత్సం సృష్టిస్తున్న ఫెంగల్‌ తుఫాను.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Fengal Cyclone: బీభత్సం సృష్టిస్తున్న ఫెంగల్‌ తుఫాను.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Subhash Goud

|

Updated on: Nov 30, 2024 | 12:19 PM

Fengal Cyclone: భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్‌ భయంతో ఫ్లై ఓవర్లపై కార్ల పార్కింగ్, సబ్‌వేలను మూసివేశారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది..

ఫెంగల్‌ తుఫాన్‌ తమిళనాడును వణికిస్తోంది. తీరం దాటక ముందే కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఫెంగల్‌. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది చెన్నై. ఈ తుఫానుపై అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా సహాయక చర్యలపై సీంఎ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెన్నై సహా ఆరు జిల్లాల్లో తుఫాన్‌ తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రాత్రికి చెన్నైలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సీఎం స్టాలిన్ సూచించారు. లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎం తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్‌ భయంతో ఫ్లై ఓవర్లపై కార్ల పార్కింగ్, సబ్‌వేలను మూసివేశారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాన్‌ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు.