తేరుకుంటున్న అస్సాం.. గౌహతిలో కర్ఫ్యూ ఎత్తివేత
ఆరు రోజుల అనంతరం అస్సాం రాజధాని గౌహతి లోను, దిబ్రుగఢ్ తదితర జిల్లాల్లోనూ పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే మొబైల్, ఇంటర్నెట్ లపై ఆంక్షలు మరో 24 గంటలపాటు కొనసాగుతాయి. పోలీసు శాఖ సంతృప్తి చెందిన పక్షంలో ఈ ఆంక్షలను ఎత్తివేయవచ్ఛునని గౌహతి హైకోర్టు పేర్కొంది. కాగా-బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుధ్ధరించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ బుధవారం సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణకు పూనుకొన్నారు. అయితే తమ ఆందోళనకు […]
ఆరు రోజుల అనంతరం అస్సాం రాజధాని గౌహతి లోను, దిబ్రుగఢ్ తదితర జిల్లాల్లోనూ పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే మొబైల్, ఇంటర్నెట్ లపై ఆంక్షలు మరో 24 గంటలపాటు కొనసాగుతాయి. పోలీసు శాఖ సంతృప్తి చెందిన పక్షంలో ఈ ఆంక్షలను ఎత్తివేయవచ్ఛునని గౌహతి హైకోర్టు పేర్కొంది. కాగా-బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుధ్ధరించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ బుధవారం సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణకు పూనుకొన్నారు. అయితే తమ ఆందోళనకు ఏ రాజకీయ పార్టీ మద్దతునూ కోరే ప్రసక్తి లేదని, అలాగే ఆయా పార్టీల నిరసన ప్రదర్శనలను తాము సపోర్ట్ చేయబోమని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌహతిలో కొందరు సినీ నటీనటులతో బాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నేతలుకూడా స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. కేంద్రం ఈ వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకునేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు తెలిపారు.