జనవరి 15, 2020 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఎలా పొందాలంటే?
2020 జనవరి 15 నుండి జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అయింది. మార్కెట్లో ట్యాగ్‌ల కొరత కారణంగా మునుపటి డిసెంబర్ 15, 2019 గడువును 30 రోజులు పొడిగించారు. ఫాస్ట్ ట్యాగ్ అంటే ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ అని అర్థం. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ గేట్ల వద్ద వాహనానికి ఆటోమేటిక్ టోల్ కు అనుమతి లభిస్తుంది. ఇది ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీతో పనిచేస్తుంది. ట్యాగ్ వాహనాల విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. దీంతో […]
2020 జనవరి 15 నుండి జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అయింది. మార్కెట్లో ట్యాగ్‌ల కొరత కారణంగా మునుపటి డిసెంబర్ 15, 2019 గడువును 30 రోజులు పొడిగించారు. ఫాస్ట్ ట్యాగ్ అంటే ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ అని అర్థం. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ గేట్ల వద్ద వాహనానికి ఆటోమేటిక్ టోల్ కు అనుమతి లభిస్తుంది. ఇది ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీతో పనిచేస్తుంది. ట్యాగ్ వాహనాల విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. దీంతో వినియోగదారుడు టోల్ చెల్లించడానికి టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోని 560 ప్లాజాలకు ఫాస్టాగ్స్ ద్వారా టోల్ వసూలు చేస్తుంది. వాహనం టోల్ దాటిన తర్వాత, వినియోగదారుకు తగిన వివరాలతో ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. టోల్ గేట్ల వద్ద నగదు వసూలును కొనసాగిస్తున్నప్పటికీ, 2020 జనవరి 1 తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లేకుండా నడుస్తున్న వాహనాలకు టోల్ గేట్ల వద్ద సాధారణ రేటు కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఫాస్ట్‌టాగ్‌ను అమెజాన్, పేటీఎం, మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ వంటి ఇ-కామర్స్ పోర్టల్స్ ద్వారా లేదా 23 బ్యాంకులు ఏర్పాటు చేసిన 27,000 పాయింట్-ఆఫ్-సేల్స్ వద్ద లేదా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంచుకున్న పెట్రోల్ బంకుల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఐదేళ్ల కాల పరిమితితో ఉంటుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ‘నా ఫాస్ట్‌టాగ్’ యాప్ ద్వారా కాని పేటీఎం ద్వారా కాని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, రీఛార్జ్ చేయవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా వినియోగదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో డబ్బును జోడించడానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యుపిఐ, పేటిఎమ్, గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరపవచ్చు.