బిగ్ బాస్: ఇట్స్ ఏ హేట్ స్టోరీ.. ఎవరు హీరో..? ఎవరు విలన్..?
హిందీ బిగ్ బాస్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం కంటెస్టెంట్లు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా కూడా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో పోరు భీకరంగా మారింది. ఇదిలా ఉంటే రష్మీ, అర్హన్ ఖాన్ మధ్య లవ్ స్టోరీ ఆసక్తికరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నీమధ్య సల్మాన్ ఖాన్.. అర్హన్ మనసులో ఉన్న కపట ప్రేమను బహిర్గతం చేయడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే రష్మీ, అర్హన్ ఖాన్‌ల లవ్ […]

హిందీ బిగ్ బాస్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం కంటెస్టెంట్లు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా కూడా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో పోరు భీకరంగా మారింది. ఇదిలా ఉంటే రష్మీ, అర్హన్ ఖాన్ మధ్య లవ్ స్టోరీ ఆసక్తికరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నీమధ్య సల్మాన్ ఖాన్.. అర్హన్ మనసులో ఉన్న కపట ప్రేమను బహిర్గతం చేయడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
అయితే రష్మీ, అర్హన్ ఖాన్‌ల లవ్ స్టోరీకి ఇప్పటివరకు సల్మాన్ విలన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి అసలు కారణం వేరొకరు ఉన్నారని.. ఇప్పుడు ఓ వార్త బయటికి వచ్చింది. ఆమె ఎవరో కాదు షెఫాలీ బగ్గా. ఇక ఈ విషయాన్ని స్వయంగా సిద్ధార్థ్ శుక్లానే రష్మీకి చెప్పడం విశేషం.
షెఫాలీకి అర్హన్ క్యూట్‌గా అనిపించాడని.. అందుకే లైన్ వేస్తోందని సిద్ధార్థ్ అన్నాడు. అంతేకాకుండా ఫైనల్‌కు వెళ్లేందుకు ఇద్దరూ కలిసి.. నిన్ను పక్కన పెట్టాలని చూస్తున్నట్లు వివరించాడు. ఇక ఈ విషయం మొత్తం విన్న రష్మీ సిద్ధార్థ్‌పై మండిపడింది. ‘ఇలాంటి బక్వాస్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావ్. ఇదేం మజాక్ చేసే టైం కాదు అని ‘ రష్మీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా సిద్ధార్థ్ చెప్పిన ఈ అంశం అర్హన్ దగ్గర ప్రస్తావించి.. ఇది నిజం కాదని అందరి ముందు చెప్పాలని స్పష్టం చేసింది.
గతంలో సిద్ధార్థ్, రష్మీల మధ్య హేట్- లవ్ స్టోరీ జరిగింది. ఇప్పుడు అర్హన్ కూడా మధ్యలోకి రావడంతో మున్ముందు ఎలాంటి ట్విస్టులు వస్తాయోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. అంతేకాకుండా అర్హన్.. తనకు షెఫాలీకి మధ్య సంబంధం గురించి అందరికి చెబుతాడా లేదో కూడా తెలియాల్సి ఉంది.




