సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే?

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబిఎస్‌ఈ) తన అధికారిక వెబ్‌సైట్ లో 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షల 2020 సంవత్సరపు టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమవుతాయి. గత సంవత్సరం కూడా ఇదే తేదీన సిబిఎస్‌ఇ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 12 వ తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి ప్రారంభమవుతాయి. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:46 pm, Wed, 18 December 19
సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే?

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబిఎస్‌ఈ) తన అధికారిక వెబ్‌సైట్ లో 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షల 2020 సంవత్సరపు టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమవుతాయి. గత సంవత్సరం కూడా ఇదే తేదీన సిబిఎస్‌ఇ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 12 వ తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి అభ్యర్థికి ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాలు ఇవ్వబడుతుంది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను విడివిడిగా క్లియర్ చేయాలి. సీబీఎస్‌ఈ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడానికి 33 శాతం మార్కులు సాధించాలి.

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ (క్లిక్ చేయండి) 

12వ తరగతి పరీక్షల షెడ్యూల్ (క్లిక్ చేయండి)