మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు

మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం..

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు
Follow us

|

Updated on: Feb 06, 2021 | 3:40 PM

మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా కమెండోలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతలకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.

ప్రపంచంలోనే తొలి మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేసిన ఘనత సీఆర్ పీఎఫ్‌కే దక్కింది. సీఆర్ పీఎఫ్ మహిళా కమెండోలను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు పంపించి వారి ఆట కట్టిస్తామని సీఆర్‌పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ మహిళా బెటాలియన్ లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ డైరెక్టరు జనరల్ ఏపీ మహేశ్వరి చెప్పారు.

మహిళా బెటాలియన్‌లో పనిచేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు పలు అవార్డులు లభించాయి. విధి నిర్వహణలో సీఆర్‌పీఎఫ్ దళం అత్యంత ధైర్యసాహసాలు చూపిస్తుందని డీజీ మహేశ్వరి వివరించారు. ఈ ఆపరేషన్‌లో మహిళా కమెండోలు నూటికి నూరు శాతం విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.

Read more:

ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలి.. ఎన్నికల సమయంలో ఎంతటి వారైనా కోడ్‌ పాటించాల్సిందే -తులసిరెడ్డి

Latest Articles