Credit Card: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌తో భారీ స్కాం.. ఇదిగో పూర్తి వివరాలు

| Edited By: Aravind B

Sep 30, 2023 | 4:00 PM

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సాధారణంగా క్రెడిట్ కార్డు రివరాట్ పాయింట్స్ వాడండి అంటూ మనకి తరచూగా మెసేజ్‎లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలా మెసేజ్ పొందిన ఓ 60 సంవత్సరాల న్యాయవాది ఏకంగా ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. తన అకౌంట్‌లో ఉన్న ఉన్న ఐదు లక్షల రూపాయలు కేవలం ఒక్క లింక్ క్లిక్ చేయగానే మాయమైపోయాయి.

Credit Card: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌తో భారీ స్కాం.. ఇదిగో పూర్తి వివరాలు
Credit Card Scam
Follow us on

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సాధారణంగా క్రెడిట్ కార్డు రివరాట్ పాయింట్స్ వాడండి అంటూ మనకి తరచూగా మెసేజ్‎లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలా మెసేజ్ పొందిన ఓ 60 సంవత్సరాల న్యాయవాది ఏకంగా ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. తన అకౌంట్‌లో ఉన్న ఉన్న ఐదు లక్షల రూపాయలు కేవలం ఒక్క లింక్ క్లిక్ చేయగానే మాయమైపోయాయి. అలాగే బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త కొత్త రకాల మోసాలకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ పేరును వాడుకొని అమాయకుల ఖాతాల నుండి లక్షల కొద్ది రూపాయలు ఒక్క క్లిక్ తో డ్రా చేస్తున్నారు.

స్కాం ఇలా మొదలవుతుంది..
మీ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ రేపటితో గడువు ముగుస్తుంది అని ఒక కాల్ చేస్తారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ రీడిమ్ చేసుకుంటే ఎక్కువ ఆఫర్లు వస్తాయని నమ్మిస్తారు. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ లింక్‌ను క్లిక్ చేయగానే మనల్ని మాయ చేస్తారు. ఫోన్ పెట్టేయ గానే లింకు క్లిక్ చేయండి అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఫోన్ కట్ కాగానే మన మొబైల్ కి ఒక టెక్స్ట్ మెసేజ్‎కు జతగా ఒక లింకు అటాచ్ అయ్యి మెసేజ్ వస్తుంది. వెంటనే రివార్డు పాయింట్స్ రీడిమ్ చేసుకోవడానికి ఆ లింక్ క్లిక్ చేశారో ఇంకా అంతే సంగతి. ఆ లింకు క్లిక్ చేయగానే ఒక కొత్త యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ లో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే నేరగాళ్లు ఆ వివరాలు తీసుకొని మన ఖాతాను లూటీ చేస్తున్నారు.

బెంగళూరులో కుమార‎కృప రోడ్‎లో నివాసం ఉంటున్న 60 సంవత్సరాల న్యాయవాదికి ఈ ఘటన ఎదురైంది. సెప్టెంబర్ 20వ తారీఖున తన మొబైల్ ఫోన్‌కు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. 4,999 రూపాయలు విలువచేసే తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ రేపటితో ఎక్స్పైర్ అయిపోతున్నాయని నమ్మించి వాటిని రీడిమ్ చేసుకోవాల్సిందిగా మెసేజ్ వచ్చింది. ఆ లింకు క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అయింది. క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే తన ఖాతాలో నుండి డబ్బు డెబిట్ కావడం మొదలైంది. తర్వాత బ్యాంకు సిబ్బంది నుంచి ఫోన్ రావడంతో అసలు విషయం బయటపడిపోయింది. ఆ లావాదేవి తాను చేయలేదని చెప్పటంతో వెంటనే బ్యాంకు సిబ్బంది తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేసేసారు.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ మారిన పడకుండా ఉండాలంటే

*సంబంధం లేని ఈమెయిల్, ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి

*బ్యాంకు నుండి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు సంబంధిత వివరాలను వెరిఫై చేయండి

*మనకు తెలియని నంబర్ల నుండి ఏదైనా లింకులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయవద్దు

*ఎప్పటికప్పుడు మన ఫోన్‎లో యాంటీవైరస్ తో పాటు మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఉండేలా చూసుకోండి

*ఆన్లైన్ బ్యాంక్ ఖాతాలకు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..