సంగీతం అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కొందరు శ్రావ్యమైన సంగీతాన్ని వింటారు. మరికొందరు ఫాస్ట్ బిట్ సంగీతం వింటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీతం ఇష్టం ఉంటుంది. అయితే కేవలం మనుషులే సంగీతం వింటారా అంటే కాదు.. జంతువులు కూడా పాటలు వింటాయి. ఇలానే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని కన్హా గోశాలలో ఆవులు ప్రతి రోజు పాటలు వింటున్నాయి. తక్కువ వాల్యూమ్‌లో లౌడ్‌స్పీకర్‌లలో భజనలు వింటున్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ త్రిపాఠి, నగర పంచాయతీ అధికారులను ఉదయం, సాయంత్రం గోవులకు శ్రావ్యమైన శ్రీకృష్ణ కీర్తనలను ప్లే చేయాలని ఆదేశించారు.
గోవుల ఆశ్రయాలలో సంగీతాన్ని ప్లే చేస్తే, ఆవులు సంగీతానికి అనుకూలంగా స్పందిస్తాయని నమ్ముతారు. గత వారం కన్హా గో ఆశ్రమానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ ఎస్పీ కమలేష్ దీక్షిత్ ఆవులను పూజించారు. శీతాకాలాన్ని నివారించడానికి ఆవులకు కుంకుమ రంగు శాలువలు ఇచ్చారు. అధికారులిద్దరూ ఆవులకు బెల్లం సమర్పించారు.
Read Also… Yesudas: ఆయనది అయిదు పుష్కరాల స్వరం.. అయినా తరగని మాధుర్యం.. జేసుదాసు తొలి పాటకు ఆరవై ఏళ్లు
Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..