Covid-19 vaccination: దేశంలో 55 కోట్ల మార్క్ దాటిన కోరోనా వ్యాక్సినేషన్.. నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ..

Covid vaccination in India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ఇటీవల

Covid-19 vaccination: దేశంలో 55 కోట్ల మార్క్ దాటిన కోరోనా వ్యాక్సినేషన్.. నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ..
Youth Covid Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 9:44 AM

Covid vaccination in India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ఇటీవల పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న వైద్య నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తిని సైతం వేగంగా చేపట్టేలా ప్రణాళికలు చేసింది. ఈ క్రమంలో దేశంలో టీకా డ్రైవ్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 86.29లక్షల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో వేసిన టీకా మోతాదుల సంఖ్య 55 కోట్ల మార్క్‌ను దాటిందని వెల్లడించింది. ఒకే రోజు 18-44 సంవత్సరాల వారు 31,44,650 మందికి తొలి, 5,22,629 మందికి సెకండ్‌ డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ టీకా డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18-44 ఏళ్ల మధ్య 20,00,68,334 మంది మొదటి డోసు ఇచ్చారు. మరో 1,59,35,853 మందికి రెండో మోతాదు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్విట్ చేశారు. కరోనా వైరస్‌పై భారతదేశ పోరాటాన్ని బలోపేతం చేద్దామని.. టీకా వేయించుకుందామంటూ ఆరోగ్య మంత్రి సూచించారు. టీకా డ్రైవ్‌ సోమవారం నాటికి 213 నాటికి చేరగా.. మొత్తం 55,85,834 టీకా మోతాదులు అందించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read:

Cyber Crime: లక్కీ డ్రాలో కారొచ్చిందంటూ ఫోన్.. నిజమని నమ్మి కేటుగాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..

Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో నిలిచిపోయిన విమానాల రాకపోకలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులు!