Covid-19 India: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 154 రోజుల తర్వాత..

Covid-19 Updates in India: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..

Covid-19 India: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 154 రోజుల తర్వాత..
India Corona Updates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 10:10 AM

Covid-19 Updates in India: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం 25,166 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 154 రోజుల తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 3,69,846 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 146 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 97.51 శాతంగా రికవరీ రేటు ఉంది.

గత 24 గంటల్లో కొత్తగా 437 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679 కి చేరుకుంది. దీంతోపాటు.. మరణాల సంఖ్య 4,32,079 కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3,14,48,754 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36,830 మంది రోగులు కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సోమవారం వరకు దేశంలో 54.58 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసుల సంఖ్య 76 కి చేరుకుందని సోమవారం మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్ బారిన పడిన వారలో 10 మంది మొదటి డోసు తీసుకోగా.. 12 మంది రెండు డోసులను కూడా తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది.

Also Read:

Cyber Crime: లక్కీ డ్రాలో కారొచ్చిందంటూ ఫోన్.. నిజమని నమ్మి కేటుగాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..

Covid-19 vaccination: దేశంలో 55 కోట్ల మార్క్ దాటిన కోరోనా వ్యాక్సినేషన్.. నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ..

షాకింగ్.. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడైనా చూశారా..? బైకర్ ప్రాణాలు తీసిన నెమలి..