Covid New Variant: మహారాష్ట్రలో కొత్త వేరియంట్‌తో అప్రమత్తమైన తమిళనాడు

Covid New Variant: గత రెండేళ్లుగా చాపకింద నీరులా వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లతో మళ్లీ పుట్టుకొస్తోంది. చైనా పుట్టినిల్లు..

Covid New Variant: మహారాష్ట్రలో కొత్త వేరియంట్‌తో అప్రమత్తమైన తమిళనాడు
Follow us

|

Updated on: Apr 08, 2022 | 5:12 AM

Covid New Variant: గత రెండేళ్లుగా చాపకింద నీరులా వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లతో మళ్లీ పుట్టుకొస్తోంది. చైనా పుట్టినిల్లు అయిన కరోనా.. అక్కడ కూడా మళ్లీ విజృంభిస్తోంది. చైనా (China)లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ (Lockdown) ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక భారత్‌లో తొలిసారిగా ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ (XE) వేరియంట్‌ కేసు మహారాష్ట్రలోని ముంబైలో బయటపడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఇప్పటి వరకు తమ రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, ముందస్తుగా అప్రమత్తం అవుతున్నామని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయల్లో ప్రయాణికులపై నిఘా పెట్టినట్లు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతుండటంతో అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు.

అయితే తమిళనాడులో కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్రలో ఎక్స్‌ఈ వేరియంట్‌ బయటపడినట్లు వార్తలు వచ్చినా కేంద్రం మాత్రం తోసిపోచ్చింది. తాము అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తమిళనాడులో మొత్తం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు (చెన్నై, తిరుచిరాపల్లి, మదురై, కోయంబత్తూరు) ఉండగా.. ఆయా ఎయిర్‌పోర్టుల వద్ద ఫీవర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులను నిరంతరం నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చెన్నై, చెంగల్‌పేట్‌, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు అయినా కాంటాక్టు ట్రేసింగ్‌ చేయాలని జిల్లా అధికారులకు, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

మరోవైపు చైనాలోని అతి పెద్ద నగరం షాంఘైలోనే దాదాపు 80 శాతం మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించింది అక్కడి ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పరిస్థితి చేజారిపోనివ్వకుండా ఆర్మీని సైతం రంగంలోకి దించారు అధికారులు.

ఇవి కూడా చదవండి:

Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. ప్రధాని ఇంటి దగ్గర హైటెన్షన్‌

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.