COVID Pandemic Impact: డెయిరీ పరిశ్రమ పై కోవిడ్ ఎఫెక్ట్..సంక్షోభ సమయంలో ఏం చేయాలంటే.. సీఐఐ సూచనలు!

ప్రపంచవ్యాప్తంగా పాలు-పాల ఉత్పత్తులపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే పడింది. పాలు ఉత్పత్తి విషయంలో పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. పాలను సరఫరా చేయడానికి లాజిస్టిక్స్ వ్యవస్థ ఆగిపోవడం పాల అమ్మకాలపై ప్రభావం చూపించింది.

  • KVD Varma
  • Publish Date - 4:21 pm, Mon, 19 April 21
COVID Pandemic Impact: డెయిరీ పరిశ్రమ పై కోవిడ్ ఎఫెక్ట్..సంక్షోభ సమయంలో ఏం చేయాలంటే.. సీఐఐ సూచనలు!
Covid Impact On Dairy

COVID Pandemic Impact: ప్రపంచవ్యాప్తంగా పాలు-పాల ఉత్పత్తులపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే పడింది. పాలు ఉత్పత్తి విషయంలో పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. పాలను సరఫరా చేయడానికి లాజిస్టిక్స్ వ్యవస్థ ఆగిపోవడం పాల అమ్మకాలపై ప్రభావం చూపించింది. డిమాండ్ ఉన్నప్పటికీ, ఆస్థాయిలో రవాణా చేయడానికి వీలుకాక డెయిరీ వ్యవస్థ కుంగిపోయింది. రవాణా సదుపాయాలు లేకపోవడం డెయిరీ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఎందుకంటే, పాల ఉత్పత్తులు సమయానికి వినియోగదారులను చేరకపోతే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి దెబ్బకు డెయిరీ ఉత్పత్తులు తీవ్ర ప్రభావితం అయ్యాయి. కోవిడ్ ముందు ఉన్న డిమాండ్ సరఫరా అంతం కోవిడ్ పరిస్థితుల్లో బాగా పెరిగిపోయింది. ఈ ఎఫెక్ట్ రైతులకు దక్కే రైతులపై పడింది. దీంతో మొదటిసారి కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితుల్లో డెయిరీ వ్యవస్థ బాగా దెబ్బతింది. ఇది ఒక గొలుసు.. రైతు దగ్గర నుంచి వినియోగదారునికి చేరేదాకా చాలా అంచెలు ఇందులో ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది రవాణా వ్యవస్థ. లాక్ డౌన్ ప్రభావంతో రవణా నిలిచిపోవడంతో ఈ గొలుసు తెగింది. దీంతో.. డెయిరీ పరిశ్రమ దెబ్బతింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాలను ఎక్కువగా స్వీట్స్ తయారీ, రెస్టారెంట్స్ లో వాడతారు. లాక్ డౌన్ తో ఇవన్నీ మూత పడటమూ డెయిరీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇది దాదాపు 30 నుంచి 35 శాతం పాల వినియోగంపై ప్రభావం చూపించింది అని అంచనా వేశారు.

డిమాండ్ కోల్పోవడం పాల సేకరణ ధరలపై ఒత్తిడి తెచ్చింది. పరిశ్రమ కోసం, COVID-19 పరిస్థితిని బట్టి, (తగ్గిన) డిమాండ్‌కు సంబంధించి పాలను అధికంగా సరఫరా చేయడం జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్-సెప్టెంబర్ నెలల్లో పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఐస్ కరీం పరిశ్తమ ద్వారా డిమాండ్ బాగా ఉంటుంది. కానీ సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ పరిస్థితులు ఉండటంతో పాల సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పల ధరలు దేశీయంగా కుప్పకూలిపోయాయి. ఆ తరువాత లాక్ డౌన్ క్రమేపీ ఎత్తివేసినా.. ఆ ప్రభావం కొనసాగింది. ఎందుకంటే, సెప్టెంబర్ తరువాత నుంచి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ తక్కువగా ఉంటుంది. లాక్ డౌన్ అనంతరం పాలు-పాల ఉత్పత్తుల పరిస్థితి మునుపటి స్థాయికి చేరాలంటే.. కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందని అంచనా వేశారు. కానీ, ఈలోపు మళ్ళీ రెండో వేవ్ కరోనా ప్రభావం తీవ్రంగా ప్రారంభం అయింది.

ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు ఏర్పడుతున్న స్థితిలో మళ్ళీ కరోనా పాల పరిశ్రమను కాటేస్తోందనే చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం డెయిరీ పరిశ్రమను ఆడుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఐఐ సిఫారసు చేసింది. అవి ఏమిటంటే.. వ్యూహాత్మక రిజర్వ్ ద్వారా మిల్క్ పౌడర్ కోసం దేశీయ డిమాండ్‌ను సృష్టించడం. దీనిని పీడీఎస్ ల ద్వారా పేద ప్రజానీకానికి పంపిణీ చేయవచ్చు. ఇది పోషకాహార పరంగా భారతదేశంలోని పేద వర్గానికి కూడా సహాయపడుతుంది. అదనంగా, పిల్లలకు పోషకాహార లభ్యతను నిర్ధారించడానికి మిడ్-డే భోజన పథకాల ద్వారా పాలు పంపిణీ చేయవచ్చు. అలాగే, దీర్ఘకాలికంగా, ఈ పరిశ్రమలలో ద్రవ్యత మరియు పని మూలధనం యొక్క కొరతను స్థిరీకరించే దిశగా, ప్రస్తుత ఎన్‌పిఎలను పునర్నిర్మించేటప్పుడు ‘వన్ హెల్త్’ మరియు ఇఎస్‌జి (ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) ప్రాజెక్టులను ప్రాధాన్యతా రంగంగా పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకింగ్ వ్యవస్థ మార్గనిర్దేశం చేయాలి.

కోవిడ్ -19 మహమ్మారి పాడి పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసింది. రైతులు మరియు పరిశ్రమలను రక్షించడానికి అనేక ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకున్నాయి. ఇటీవల, అమెరికా ప్రభుత్వం USD3 ను ప్రకటించింది. అక్కడి పాడి పరిశ్రమకు బిలియన్ రిలీఫ్ ప్యాకేజీ ఇది. అంతేకాకుండా, ఆహార బ్యాంకుల కోసం పాల ఉత్పత్తుల కొనుగోలుకు నెలకు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు యుఎస్‌డిఎ ప్రకటించింది.

సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెబుతున్నదాని ప్రకారం, “భారతదేశం ప్రపంచంలోనే పాలు ఉత్పత్తి చేసే దేశాలలో అగ్రగామిగా ఉంది, సకాలంలో జోక్యం చేసుకోవడం, ఈ రంగం తన సామర్థ్యాన్ని తిరిగి పొందటానికి సహాయపడుతుంది అలాగే, రైతులపై కోవిడ్ -19 సంక్షోభం యొక్క ప్రభావాన్ని సహేతుకంగా నిరోధించగలదు.”

Also Read: Aryabhata : భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు, ఆపై ప్రపంచ రికార్డు వరకూ ఇస్రో ప్రస్థానం

Boris Johnson: కోవిడ్ ఎఫెక్ట్…భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని..